Search
Wednesday 20 June 2018
  • :
  • :

ఎసిబికి చిక్కిన అవినీతి అనకొండ…

bribery2

అమరావతి: ఎపిలోని విజయవాడలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో ప్రభుత్వ ఉద్యోగి. ఇందులో కొత్తేమి ఉందనుకుంటే పొరపాటే… అతడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 27.50 లక్షలు లంచంగా తీసుకుంటున్న సమయంలో ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కమర్షియల్ ట్యాక్స్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఏడుకొండలు ఈ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆఫీసులోనే లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏడుకొండలు ఎపిలో చెక్‌పోస్టులకు ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. తాను తీసుకున్న రూ. 27.50 లక్షల లంచంలో రూ. 2.5 లక్షలు తన అసిస్టెంట్‌కు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. కాగా, ఓ ప్రభుత్వాధికారి ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ దొరకడం ఇదే తొలిసారి అని ఎసిబి అధికారులు వెల్లడించారు.

Comments

comments