Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

18 ఏండ్ల పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు

ps

డీసీపీ రామచంద్రారెడ్డి
భూదాన్‌పోచంపల్లి : 18 ఏల్లలోపు పిల్లలను పనిలో పెట్టుకునే యాజమాన్యాల పై కఠిన చర్యలు తీసుకుంటామని భువనగిరి డీసీపీ రామ చంద్రారెడ్డి తెలిపారు. మండల శివార్లలోని ఎస్‌పీ ఎస్ యారన్(జిప్పుల) కంపెనీలో బాల కార్మికులతో పని చేయిస్తున్న కంపనీ మేనేజర్ వెంకటేశ్వరప్ప తో పాటు బ్రోకర్ సంతోష్ యాదవ్, లేబర్ సూపర్ వైజ ర్ పల్లే బాబురావును అరెస్టు చేసి మండల కేంద్ర మై న పోచంపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం సమా వే శంలో హాజరు పర్చి వివరాలు వెల్లడించారు. పోచం పల్లి నుండి కొత్తగూడెం వెళ్లే రహదారి లో గల ఎస్ పీఎస్ యారన్(జిప్పుల) కంపెనీలో రాచకొండ కమి షనరేటు పరిధి ఎస్‌ఓటి అడిషన్‌ల్ డీసీపీ రఫీక్ చౌటప్పల్ ఏసిపి రమేశ్ ఆపరేషన్ స్మైల్ ఎస్‌ఐ సా యిలు నేతృత్వంలో రెండు బృందాలు మంగళ వా రం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారని కంపె నీలో పనిచేస్తు బీహర్ రాష్ట్రానికి చెందిన 18ఏళ్లలోపు 11మంది బాలకార్మికులకు గుర్తించి పనినుండి విముక్తి కలిగించారన్నారు. నిబంధనలకు విరూ ద్దంగా రోజుకు 200, 300 సమాచారం మేరకు ఆపరే షన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అలాగే భువనగిరిలో 6 మంది చౌటుప్పల్ లో 4మంది కి రాణం షాపులు, హోటళ్లలో పనిచేస్తున్న బాల కార్మి కు లను గుర్తించి పనినుండి విముక్తి కల్పించామని తప్పించుకున్న ఎస్‌పీఎస్ యారన్(జిప్పుల) కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ నరేష్ తప్పాను అరెస్టు చేస్తా మ న్నారు. కాగా రాచకొండ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షాపు లలో ఇండ్లబయట, సీసీ కెమెరాలు ప్రజలు అమర్చు కోవాలని తెలిపారు. యా దాద్రి భువనగిరి జిల్లాలో అన్ని మండలాలో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఆలేరు మండంలో అన్ని గ్రామాలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల కెమె రాలు ఏర్పాటు చేయాలనేది లక్షమని, దీంతో నేరాలు గణనీయంగా నేరాలు తగ్గుతాయని తెలి పారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి ఎస్‌ఐ రాఘ వేందర్, చౌటుప్పల్ ఎస్‌ఐ వెంకటయ్యగౌడ్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్,ఎన్‌ఏఎస్‌సీ ప్రతాప్, జిల్లా చైల్డ్ లైన్ టీమ్ సభ్యులు యాదయ్య, సిబ్బంది శేఖర్‌రెడ్డి, సుధాకర్, రమేష్, గంగయ్య, ఎస్‌ఓటి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

comments