Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి చర్యలు

confe*ఇసుక రీచ్‌లను ప్రజల అవసరాల కోసం ఓపెన్ చేసేందుకు చర్యలు
*వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కె. రామారావు

మనతెలంగాణ/ కామారెడ్డి: ఇసుక అక్రమ రవాణా అరి కట్టడానికి సాండ్ ట్యాక్సి పాలసీని ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు అం దుబాటులో వుండే విధంగా బుక్ చేసుకునే విధంగా జిల్లా లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కె. రామారావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో మైన్స్ జియాలజి శాఖలపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. సాండ్ ట్యాక్సి పాలసీ, ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు విరివిగా ఇసుక లభ్యమవడంతో పాటు పారదర్శకత పెరుగుతుందన్నారు. గృహనిర్మాణాలకు అవసరమైన ఇసుక ట్రాక్టర్ల విషయంలో కఠినంగా వ్యవహరించరాదని, వాణిజ్య పరమైన వా టిని పూర్తిగా పరిశీలించాలన్నారు. ఇసుక కుప్పలపై యాక్షన్ తీసుకునే విధంగా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ అధికారి మన్‌సూర్ మాట్లాడుతూ ఇసుక ఆన్‌లైన్ విధానంతో పాటు వే బ్రిడ్జిల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ శ్వేతరెడ్డి, మైన్స్ ఎడి రవి, ఆర్డిఓ శ్రీను, ఎల్లారెడ్డి ఆర్డిఓ దేవేంధర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌బ్యూరోలో…
జిల్లాలో టిఎస్‌ఎండిసి ద్వారా గుర్తించిన ఇసుక రీచ్‌లను ప్రజ ల అవసరాల కోసం ఓపెన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్‌రావు రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కె. రామారావును కోరారు. శనివారం రాష్ట్ర హోం మం త్రి టిఎస్‌ఎండిసి చైర్మన్ డిజిపి మహేంధర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరి, జయేశ్ రంజన్ కమిషనర్ అహ్మద్‌నబీం టిఎస్‌ఎండిఎప్ చైర్మన్ సుభాషణ్‌రెడ్డిలతో కలిసి రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఇసుక, సూక్ష్మ, మధ్య, చిన్న తరహాల పరిశ్రమల ఎంటర్‌ప్రైజెస్, నకిలి ఏజెంట్ల అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో కోటగిరి మండలంలోని కోడిచెర్ల 1,2 బోధన్ మండలంలోని కందుగాం, కల్దుర్కిలో మైనింగ్ కార్పొరేషన్ (టిఎస్‌ఎండిసి) ద్వారా ఇసుక రీచ్‌లను గు ర్తించి వాటికి పూర్తి అనుమతులు పొందిన వాటిని ప్రారంభించేందుకు చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ ఇసుక రీచ్‌ల వల్ల 10లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉన్నందున జిల్లా ప్రజలకు ఇసుకు సమస్య లేకుండా ఉంటుందని చెప్పడంతో అట్టి వాటిని వారంరోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పా రు. వీడియో కాన్ఫరెన్సు పూర్తయిన తదనంతరం జిల్లా కలెక్టర్ సూక్ష్మ మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఎంటర్‌ప్రైజెస్ కోసం మంత్రి కెటిఆర్ ఆదేశించిన విధంగా ప్రతి బ్యాంకుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేసి నివేదిక అందజేయాలని చెప్పారు. ఎంఎస్‌ఎంఎస్‌ఇ పరిశ్రమల ఏర్పా టు చేసిన వారితో బ్యాంకర్లు ప్రతినెల కొక్కసారి సమావేశం ఏర్పాటు చేసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక సహాయం కోసం వచ్చిన సూచనలు, సలహాలతో పాటుగా సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసే బ్యాంకర్ల స మావేశంకు బ్యాంక్ జిల్లా బాధ్యుడే హాజరు కావాలని ఆదేశించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థా పన కోసం ప్రభుత్వం నిర్దేశించిన లక్షం మేరకు రుణాలను అందించాలని వచ్చే రెండు మాసాల్లో కనీసం రెం డు లేదా మూడు ముద్ర రుణ మేళాను ఏర్పాటు చేసి మహిళాల పారిశ్రామికవేత్తలకు స్టార్టప్ కింద దళిత, గిరిజన నిరుద్యోగులకు ప్ర త్యేక దృష్టిపెట్టి రుణాలను అందించేందుకు చర్య లు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఐజి శివశంకర్‌రెడ్డి, సిపి కార్తీకేయ, అడిషనల్ డిసిపి ఆకుల రాంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్‌జయంతి. ఎడి మైనింగ్ బి. సత్యనారాయణ, ఆర్డిఓ వినోద్‌కుమా ర్, జిఎం శాంతికుమార్, నిజామాబాద్, బోధ న్, ఆర్మూర్ ఎసిపిలు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Comments

comments