Search
Sunday 21 January 2018
  • :
  • :

మరో విభిన్న పాత్రలో నిత్యమీనన్

Nithya-Menon

హైదరాబాద్: తనదైన సహజ నటనతో ఆకట్టుకునే మలయాళ కుట్టీ నిత్యమీనన్ మరో విభిన్న పాత్రలో నటిస్తుంది. కొత్త తరహా పాత్రలకు ప్రాధాన్యమిచ్చే నిత్య ఇప్పటి వరకు తన కెరీర్‌లోనే చేయని డిఫరెంట్ రోల్ చేస్తోందట. ఆమె తాజాగా నటిస్తున్న ఓ తెలుగు చిత్రంలో స్వలింగ సంపర్కురాలిగా కనిపించనుందట. ఈ మూవీలో మరో హీరోయిన్‌తో ఆమె లిప్‌లాక్ కూడా చేసిందట. అయితే ఆ హీరోయిన్ ఎవరు? ఏ సినిమా? అనేవి మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటోందీ చిన్నది. కాగా, నిత్య ఇప్పుడు తెలుగులో నటిస్తున్న చిత్రం.. నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ‘అ’లోనే. సో చూడాలి ‘అ’లోనే ఆమె ఈ పాత్రలో దర్శనమిస్తుందా? లేదా వేరే ఏ మూవీలోనైనా నిత్య ఈ పాత్రలో కనిపిస్తుందా? అనేది వేచి చూడాలి.

Actress Nitya Menon Plays Lesbian Role.

Comments

comments