Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

పెళ్లి పేరుతో నటి ఘరానా మోసం..

actrws

చెన్నై: తమిళ సినీ నటి శ్రుతి ఓ ఎన్నారైని పెళ్లి చేసుకుంటానని చెప్పి అతని నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేసింది. ఎన్నారై ఫిర్యాదుతో పోలీసులు నటిని, ఆమె తల్లిని, సోదరుడ్ని, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. సేలంకు చెందిన జి.బాలమురుగన్ అనే వ్యక్తి జర్మనీలో ఓ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే తన ప్రొఫైల్‌ను మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయగా, శ్రుతి ఈ వెబ్‌సైట్ ద్వారా మైథిలీ వెంకటేష్‌గా పరిచయమై, అతనికి ప్రపోజ్ చేసింది. బాలమురుగన్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన కుటుంబ సభ్యుల ఫోటోలను పంపించింది. ఆ తర్వాత తనకు ఆరోగ్యం బాగోలేదని, బ్రెయిన్ ట్యూమర్ శస్త్ర చికిత్స చేయించుకోవాలని, తన తల్లికి గుంబెకు కూడా శస్త్రచికిత్స చేయించాలని చెప్పి పలు వాయిదాల్లో మొత్తం రూ.41 లక్షలు తీసుకుంది. ఈ క్రమంలో శ్రుతి ఫోటోలను, ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలను బాలమురుగన్ తన స్నేహితులు, బంధువులకు చూపించగా, వారు గుర్తు పట్టి అందరిలాగే మోసపోయావని చెప్పడంతో షాక్ అయ్యాడు. దీంతో బాలమురుగన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రుతిని, ఆమె తల్లి, సోదరుడు, తండ్రిగా ఫోటోలో పోజిచ్చిన వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అయితే శ్రుతి నటించిన ’ఆది పొన ఆవని’ అనే తమిళ సినిమా తరలో రిలీజ్ కానుంది.

Comments

comments