Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

ట్రంప్ కంపు వ్యాఖ్యపై భగ్గుమన్న ఆఫ్రికా

int

జాత్యహంకారి క్షమాపణ చెప్పాలని ఆఫ్రికా దేశాల సంఘం డిమాండ్ 

నైరోబి: ఆఫ్రికా దేశాలను ‘సిట్ హోల్ (గుదము)’ దేశాలుగా పే ర్కొంటూ అసభ్య పద ప్రయో గం జరిపిన అమెరికా అధ్యక్షు డు ట్రంప్‌పై మొత్తం ఆఫ్రికన్లు ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. వారిలో చాలా మంది ట్రంప్ వ్యా ఖ్యలను అజ్ఞానంతో కూడినదిగా, జాత్యహంకార పద ప్రయోగంగా ఈసడించారు. 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ శుక్రవారం నాడు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్రంప్‌ను క్షమాపణను కోరింది. ఇది జాత్యహంకార, అన్యదేశ ద్వేషం, అసహ్యకరమైన వ్యాఖ్య అని ఒక ప్రకటనలో విమర్శించాయి. ఆ ఖండాని కి చెందిన దేశాల ఐక్యరాజ్య సమితి రాయబారులందరూ ఆ వ్యాఖ్యను ట్రంప్ వెనక్కి తీసుకోవాలని కోరా రు. అంతేకాకుండా తమకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితి రాయబారుల ఆఫ్రికన్ గ్రూపు అది ఏహ్యత కలిగించే తీవ్ర వ్యాఖ్య అని ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలించడానికి ఆ రాయబారులందరూ అత్యవసరరంగా సమావేశమై తీర్మానా న్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. మీడియా ట్రంప్ వ్యాఖ్యకు విపరీతంగా ప్రచారం కల్పించింది. ట్రంప్ వ్యాఖ్యకు స్పష్టంగా జాతి ద్వేషంతో కూడినదని ఎయు (ఆఫ్రికన్ యూనియన్) అధికార ప్రతినిధి కలండో విమర్శించారు. అమెరికాకు చరిత్ర చీకటి రోజుల్లో ఎంతమంది బానిసలుగా ఆఫ్రికా నుంచి వచ్చారు అన్న వాస్తవం కంటే ట్రంప్ తాజా వ్యాఖ్య తీవ్ర అభ్యంతరకరమని ఆమె అన్నారు. అమెరికా వలసలతో ఏర్పడిన దేశానికి ఒక ఉదాహరణని గుర్తు చేశారు. సిట్ హోల్ దేశాల వారి వలసలను అమెరికా ఎందుకు అనుమతించాలో చెప్పాలని అంటూ ట్రంప్ ఆ వ్యాఖ్య చేసినట్లు తెలిసింది. ఆఫ్రికా దేశాల నుంచి వలసలు రాకుండా రక్షణ కావాలని కాంగ్రెస్ సభ్యులు ప్రస్తావించినప్పుడు ట్రంప్ ఆ వ్యాఖ్య చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలో భాష అదికాదని తర్వాత ట్వీట్ చేశారు. ఐక్యరాజ్య సమితి ట్రంప్ చేశారంటున్న ‘సిట్ హోల్’ వ్యాఖ్యను తీవ్రంగా ఖండించింది. ఆ వ్యాఖ్య జాత్యహంకారంతో కూడిన సిగ్గుమాలిన వ్యాఖ్య అని దిగ్భ్రాంతి ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ప్రతినిధి రూపెర్ట్ కోల్ విల్లీ కూడా తీవ్రంగా ట్రంప్ వ్యాఖ్యను ఖండించారు. ఒక ఖండంలోని దేశాలన్నిటినీ కలిపి ఒకే పదంతో అసహ్యంగా అనడం తప్పన్నారు. అమెరికా రాయబారిని బోట్స్ వానా రప్పించి ట్రంప్ వ్యాఖ్యపై వివరణ కోరింది. సెనెగల్ కూడా అదే చేసినట్లు విదేశాంగ మంత్రి సిద్ధికి కాబా చెప్పారు. తమ ప్రభుత్వం ఆ వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆఫ్రికా ఖండం ప్రజల బాధలకు అమెరికా చరిత్రలో ఎలా కారణం అయింది చాలా మంది ఆఫ్రికన్ నాయకులు గుర్తు చేశారు. 30 మిలియన్ మంది ఆఫ్రికా బానిసలను 42 కోటలలో బందించారని, కొట్టారని, మందలు మందలుగా వేరే చోట్లకు తరలించారని వారు వాపోయారు.

Comments

comments