Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

మళ్లీ నాణేల తయారీ ప్రారంభం

coin

మింట్ కేంద్రాలకు ప్రభుత్వం ఆదేశాలు

కోల్‌కతా: నాణేల తయారీని ఆపేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దేశవ్యాప్తంగా నాలుగు మింట్ కేంద్రాల్లో తయారీని ప్రారంభించనున్నట్టు, ఈ ప్రక్రియ కొనసాగించనున్నట్టు కేంద్రం పేర్కొంది. బ్యాంకుల్లో స్థలం లేక నాణేల తయారీని నిలిపివేయాల్సిందిగా ఇటీవల ప్రభుత్వం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ నాణేల తయారీని పునరుద్ధరించాల్సిందిగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌పిఎంసిఐఎల్)కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కతా, ముంబయి, నోయిడా, హైదరబాద్‌లో ఈ తయారీ కేంద్రాలు(మింట్) ఉన్నాయి. నాణేల తయారీని మళ్లీ ప్రారంభించామని, చలామణీలో ఉన్న అన్ని నాణేలను తయారు చేస్తున్నామని కోల్‌కతా మింట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బిజన్ డే తెలిపారు. 7,712 మిలియన్ నాణేలను తయారు చేయాల్సిందిగా గతంలో ఆర్‌బిఐ మింట్‌లను ఆదేశించగా, ఇప్పటికే ఈ కేంద్రాల్లో 5,900 మిలియన్ నాణేలను తయారు చేశారు. ఇక మిగతావి తయారు చేయడానికి రెండున్నర నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. మార్కెట్‌లో పంపిణీకి మింట్‌ల నుంచి నాణేలు, బ్యాంక్ నోట్లను ఆర్‌బిఐ అందుకుంటుంది. ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో కాకుండా ఒకే షిఫ్ట్‌లో పనియాల్సిందిగా ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొందన్నారు. బ్యాంకుల్లో నాణేలను భద్రపరిచేందుకు స్థలం లేదని నాణేల తయారీని నిలిపివేయాల్సిందిగా ఈనెల 9న ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన విషయం తెలిసిందే. 2016 నవంబర్‌లో రూ.500, రూ.1000నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత చిల్లర కోసం ప్రజలు నానా తంటాలు పడ్డారు. భారీగా పాతనోట్లు బ్యాంకుల్లోకి వచ్చి చేరాయి. దీంతో బ్యాంకు వాల్టులన్నీ పాత నోట్లతో నిండిపోయాయి. నాణేలు దాచేందుకు స్థలం లేకపోయింది. ఈ ఏడాది జనవరి 8 వరకు ప్రభుత్వ మింట్‌లలో 2,528 మిలియన్ల నాణేలు ఉన్నాయి.

Comments

comments