Search
Friday 20 April 2018
  • :
  • :

బాహుబలి, ఖైదీని దాటేసిన ‘అజ్ఞాతవాసి’

Pawan-Kalyan

హైదరాబాద్: భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోన్న కలెక్షన్లు మాత్రం కుమ్మేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మన దగ్గర బుధవారం విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్‌లో మాత్రం గత రాత్రి నుంచే ప్రదర్శితమవుతోంది. యుఎస్‌ఎలో సుమారు 576 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ… బాహుబలి, ఖైదీ నెం. 150 సినిమాల ప్రీమియర్ షోల వసూళ్లను అజ్ఞాతవాసి దాటేసింది. బాహుబలి ప్రీమియర్ షోకి 1,005,630 డాలర్లు వసూలు చేయగా, ఖైదీ నెం. 150 మూవీ 1,295,613 డాలర్లు వసూలు చేసింది. అయితే అజ్ఞాతవాసి మాత్రం 1,464,647 డాలర్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఈ మూవీ పవన్ కెరీర్‌లోనే ప్రీమియర్ షోలకు అత్యధిక వసూళ్లు సాధించిన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Comments

comments