Search
Saturday 21 April 2018
  • :
  • :

దేశానికి వ్యవసాయమే ఆధారం

etela

*ఆకలి కేకలు ఆత్మహత్యలు లేని అకుపచ్చ తెలంగాణనే ప్రభుత్వ ధ్యేయం
*వచ్చే మే నుంచి ఎకరాకు నాలుగు వేల రూపాయలు అందిస్తాం
*మార్చి 31లోపు రెండో పంట వచ్చేల ప్రణాళికలు రూపొందిస్తున్నాము : మంత్రి ఈటెల రాజేందర్

మనతెలంగాణ/జమ్మికుంట: దేశానికి వ్యవసాయమే ఆధారమని, ఆనాడు ప్రపంచ దేశాలు అప్పుల ఊబిలో ఉన్నప్పుడు నిలదోక్కుకున్నది భారత దేశం మాత్రమే అని భారతీయ ఆర్థిక వ్యవస్థ,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మూలలు వ్యవసాయం మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.గురువారం వ్యవసాయ శాఖ అద్వర్యంలో ఈ వ్యవసాయంపై డివిజన్ స్థాయి రైతు సదస్సు స్థానిక ఎంపిఆర్ గార్డెన్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చెసిన మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైతు ఎదుగుతే దేశం,రాష్ట్రం ఎదుగుతుందని దేశానికి అన్నం పెట్టెది రైతు అన్నది మర్చి పోవద్దని అన్నారు. వ్యవసాయాన్ని పట్టించుకొని ప్రభుత్వాలు బాగుపడలేదని వర్షాం కోసం వానమ్మ వానమ్మ అని పాటపడింది దేశంలోనే ఒక తెలంగాణ ప్రాంత ప్రజలేనని అన్నారు.అనాడు అనుభవించిన దుఖ్ఖం నుండి బయటపడడానికే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు. వ్యవసాయం గురించి సిఎం కు ఏమి తెలుసు ఎమ్మెల్యేలకు ఏమి తెలుసు ఏసి గదుల్లో ఉంటారని కొందరు విమర్శిస్తారని సిఎం ఎమ్మేల్యేలు అకాశం నుండి ఊడి పడలేదని దాదాపు వ్యవస్థగురించి తెలిసినవరేనని ప్రతి సభలో రైతుల గురించే మాట్లాడుతామని అన్నారు.70సంవత్సరాలు గడిచిన ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయని వేదిస్తున్న ప్రశ్న అని అన్నారు.అందుకే అకలు కేకలు ఆత్మహత్యలు లేని అకుపచ్చ తెలంగాణే ఏ జెండగాప్రభుత్వం వ్యవసాయం చుట్టు తిరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ జిల్లా అధికారి శ్రీధర్ ఎడిఎ దామోదర్ ఆర్డీ చెన్నయ్య సహకర సంఘాల రాష్ట్ర యూనియన్ అద్యక్షులు తక్కళ్ళపెల్లి రాజేశ్వర్‌రావు నగరపంచాయతి చైర్మన్ పోడేటి రామస్వామి మార్కెట్ చైర్మన్ పింగిళి రమేష్ హుజురాబాద్ చైర్మన్ కోండాల్‌రెడ్డి ఎంపిపి గంగారపు లత వైస్ ఎంపిపి చుక్క రంజీత్ ఇల్లందకుంట అలయ చైర్మన్ ఎక్కటి సంజీవరెడ్డి వీణవంక సింగిల్ విండో చైర్మన్ సాధవరెడ్డి తహశీల్దార్ బావుసింగ్ ఎఓ గోవర్దన్ నగరపంచాయతి వైస్ చైర్మన్ బచ్చు శివశంకర్ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు హుజురాబాద్,జమ్మికుంట,వీణవంక,మానకోండూర్ మండలాల రైతు సమన్వయ కమిటి సభ్యులు రైతులు ఆయా మండలాల ఎఈఓలు తదితరులు ఉన్నారు.

Comments

comments