Search
Friday 20 April 2018
  • :
  • :

సరోగసిపై చిత్రంలో ఐశ్వర్య?

ishwarya

మాతృత్వం అనేది ప్రతి మహిళకు మరచిపోలేని అనుభూతి. నవమాసాల పాటు బిడ్డను కడుపులో మోసి ప్రాణాలు పణంగా పెట్టి బిడ్డను భూమి మీదకు తీసుకువస్తుంది తల్లి. అయితే పిల్లలు లేని వారు కొందరు ఈమధ్య సరోగసి (అద్దెకు గర్భం) విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ సున్నితమైన అంశంతో ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతోంది. ‘జాస్మిన్’ పేరిట తెరకెక్కనుంది ఈ చిత్రం. సినిమా కథ విషయానికొస్తే… గుజరాత్‌కు చెందిన ఓ మహిళ  సరోగసి ద్వారా పిల్లలు లేని వారి కోసం తన గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. తీరా బిడ్డ పుట్టాక పేగు బంధాన్ని తెంచుకోలేక కన్నబిడ్డ కోసం న్యాయ పోరాటం మొదలుపెడుతుంది. ఇందు లో ముఖ్య పాత్రలో నటించాలని స్టార్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ను కోరారట ఫిల్మ్‌మేకర్స్. అయితే ఈ రోల్ చేస్తానా లేదా అన్నది ఐశ్వర్య ఇంకా తేల్చిచెప్పలేదు. ఈ రోల్ కానీ ఒప్పుకుంటే ఐశ్వ ర్య కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ రోల్స్‌లో ఒకటిగా జాస్మిన్ పా త్ర నిలిచిపోతుందని ఫిల్మ్‌మేకర్స్ అంటున్నారు. క్రియార్జ్ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ మూకాంబికి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ గరిమ డైరెక్ట్ చేయబోతున్నాడు. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. కమింగ్ సూన్ అని కాకుండా డెలివరింగ్ సూన్ అంటూ సినిమాపై ఆసక్తి పెంచేలా క్యాప్షన్ జోడించారు.

Comments

comments