Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ పరిశీలనలో మద్యం గోదాములు

meeting
*కల్తీ మద్యం అమ్మిన రాజ్ బార్ అనుమతులు రద్దు, బార్ సీజ్
*సూర్యాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నల్లగొండ డివిజన్ డిప్యూటీ కమిషనర్ జీవన్‌సింగ్

మన తెలంగాణ/సూర్యాపేట: జిల్లాలో మద్యం గోడాముల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి నివేదిక అందాకే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రొహిభిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నల్లగొండ డివిజన్ డిప్యూటి కమీషనర్ ఎన్.జీవన్‌సింగ్ అన్నారు. ఉమ్మడి జిల్లాల మద్యం దుకాణాల తనిఖీలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం శాఖా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మద్యం దుకాణాలను తనిఖీ చేసేందుకు ఎన్‌పోర్స్‌మెంట్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచరిస్తుందన్నారు. జిల్లాలో కొన్ని మద్యం దుకాణాలలో కల్తీ మద్యం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అట్టి షాపులపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. నిబంధనలకు లోబడి పనిచేయని మద్యం దుకాణాలపై కొరడా ఝులిపిస్తామని హెచ్చరించారు. వైన్ షాపులకు అనుమతి ప్రకారం ఇచ్చిన స్థలంలోనే పర్మిట్ రూం నిర్వహించుకోవాలని సూచించారు. ఎక్కువ స్థలాన్ని కేటాయిస్తే సహించబోమని చెప్పారు. ప్రభుత్వం తరపున జిల్లా వ్యాప్తంగా నాటు సారా కేసులో బైండోవరై లబ్ధిపొందిన 391 మంది నేడు తమ వృత్తులను సాఫీగా కొనసాగిస్తున్నారని చెప్పారు. అందుకు శాఖాధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, భువనగిరి పట్టణ కేంద్రాల్లో వైన్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రొహిభిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి డి.శ్రీనివాస్, సూర్యాపేట సిఐ ఆర్.తిరుపతిరెడ్డి, తుంగతుర్తి సిఐ బాలాజీ నాయక్, ఎస్సైలు సాజిత్, హన్మంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కల్తీ మద్యం అమ్మిన బార్ సీజ్
జిల్లా కేంద్రంలోని కల్తీ మద్యం అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శాఖా కమీషనర్ శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. మద్యం నాణ్యతపై తనిఖీ చేసిన అధికారులు కొన్ని మద్యం బాటిళ్లను సేకరించారు. అట్టి బాటిళ్లలో 16 శాతం నీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించడంతో శనివారం జిల్లా కేంద్రంలోని రాజ్‌కమల్ బార్ అనుమతిని రద్దు చేసి సీజ్ చేశారు.

Comments

comments