Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

శరీర బరువును సులువుగా తగ్గించే కలబంద

ph

సహజంగా మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామంతోపాటూ, కలబంద రసాన్ని కూడా క్రమంగా తీసుకోవాలి. బరువు తగ్గించటంలో ఇది గొప్పగా పని చేస్తుంది. కానీ కలబందను ఎలా వాడితే మన శరీర బరువు తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
* కొవ్వుని కరిగిస్తుంది : కలబందలో ఉండే ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ వంటివి మన శరీర అవయవాల చుట్టూ ఉండే కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గించి వేస్తాయి. సన్నబడాలి అనుకునే వారు కలబంద రసాన్ని ప్రతిరోజు పాటించే ఆరోగ్యకర ప్రణాళికలో చేర్చుకోవాలి.
* జీవక్రియను పెంచుతుంది: కలబంద రసంలో ఉండే ఫైటో స్టెరాల్స్ అంతర్గతంగా జీవక్రియ రేటును రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో ఉపయోగపడతాయి. ఫలితంగా శరీర బరువు తగ్గుతుంది. అందాన్ని మెరుగు పరిచే గుణాలను కలిగి ఉండే కలబంద, శరీర బరువు తగ్గించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
* కలబందతోబాటు అల్లం : అల్లం మన శరీర బరువు తగ్గించే అద్భుతమైన ఔషధం. ఈ రకం బరువు తగ్గించే రెసిపీ కోసం ఒక చెంచా కలబంద రసం, ఒక చెంచా అల్లం, ఒక కప్పు వేడి నీటిని తీసుకోవాలి. వీటిని తక్కువ మంట వద్ద కలిపి వేడి చేయాలి. ఇలా తయారు చేసిన మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది.
* కలబంద, గ్రీన్ టీ : యంటీ ఆక్సిడెంట్‌లను అధికంగా కలిగి ఉండే గ్రీన్ టీ శరీర బరువును తగ్గించటంలో అద్భుతంగా పని చేస్తుంది. దీని తయారీకి కలబంద ఆకు, గ్రీన్ టీ అవసరమవుతాయి. దీనిని రోజులో రెండు సార్లు తీసుకోవటం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. మంచి ఫలితాల కోసం ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే ముందు తీసుకోవటం చాలా మంచిది.
* కలబందతో స్ట్రాబెర్రీ : బరువు తగ్గించడంలో స్ట్రాబెర్రీ అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్, డయూరేటి కారణమని చెప్పవచ్చు. క్యాలరీలు తక్కువ, అందుకే బరువు తగ్గించే క్రమంలో దీన్ని ఉపయోగిస్తారు, ఇంకా డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది, చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల , బరువు తగ్గించుకోవడానికి ఉపయోగించడం ఇది ఫర్ఫెక్ట్ అని పలువురు వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Comments

comments