Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

అమెరికా పీఛేముడ్

trump

మళ్ళీ ‘పారిస్’ ఒప్పందం వైపు చూపు

వాషింగ్టన్: పారిస్ వాతావరణ ఒప్పందానికి అమెరికా తిరిగి వస్తుందా? అధ్యక్షుడు ట్రంప్ గురువారం చేసిన వ్యాఖ్యల్లో ఈ మేరకు సంకేతం ఉంది. గత జూన్‌లో ఆ ఒప్పందం నుంచి ట్రంప్ యంత్రాంగం ఉపసంహరించుకుంది. అయితే తాజా ప్రకటనలో తిరిగి ఆ ఒప్పందాన్ని శిరసా వహించే సూచన చూచాయిగా ట్రంప్ అందించారు. పర్యావరణ అంశాలకు తన పాలనా యంత్రాం గం ప్రాముఖ్యం ఇస్తుందని చెప్పారు. అయితే మాకు వ్యాపారంలో పోటీతత్వం కాపాడడం కూడా ముఖ్యమని చెప్పారు. ‘శుభ్రమైన నీరు, గాలి కావాలి’ అని పేర్కొన్నారు. అయితే పారిస్ ఒప్పందం నుంచి వైదొలగుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. అయితే పర్యావరణ ప్రాధాన్యతల వల్ల అమెరికా వ్యాపారం దెబ్బతింటోందని చెప్పారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్ బెర్గ్‌తో ఉమ్మడి విలేకరుల గోష్టిలో ఆయన ఈ సంకేతం అందించారు.
సకాలంలో కిమ్‌తో చర్చలు : ట్రంప్
ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం మళ్లీ స్పష్టం చేశారు. అయితే సరియైన కాలంలో అవి జరుగుతాయన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో టెలిఫొన్ సంభాషణలో ఆయన ఈ విషయం చెప్పారు. ఉత్తర కొరియాతో ఇటీవల తాము జరిపిన చర్చల వివరాలను ట్రంప్‌కు జే అందించారు. సరియైన కాలంలో, సరియైన పరిస్థితిలో ఉత్తర కొరియాతో అమెరికా చర్చలు సాగుతాయని ట్రంప్ వివరించారు. దక్షిణ కొరియా నేతతో తన సంభాషణ చక్కగా సాగినట్లు విలేకరులకు ట్రంప్ వివరించారు.

Comments

comments