Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సిగరెట్‌లు అమ్మలేదని భారతీయుడి దారుణ హత్య

Londonలండన్: ఉత్తర లండన్‌లోని టీనేజర్లకు సిగరెట్‌ను అమ్మడానికి తిరస్కరించిన భారత సంతతికి చెందిన దుకాణదారు హత్యకు గురయ్యారు. 49 ఏళ్ల విజయ్ పటేల్ అనే ఆ వ్యక్తిపై  మిల్ హిల్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు తలకు తగిలిన గట్టి దెబ్బల వలన మరణించాడు. ఈ దాడిలో పాల్గొన్న వారు పరారయ్యారు. వారిని పట్టుకోవాలని కోరుతూ మరణ శయ్యపై అతడి  పటేల్ కుటుంబం విడుదల చేసింది. పటేల్ ఇద్దరు బిడ్డల తండ్రి. అతడిని చంపినట్లు 16 ఏళ్ల బాలుడిపై కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి. ఆ బాలుడు కోర్టుకు హాజరయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ముగ్గురు వ్యక్తులకు ఆ హత్యతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఎటువంటి కవ్వింపు లేకుండా అప్పటికప్పుడు జరిగిన ఘటనగా ఈ హత్యను డెటెక్టివ్ ఇనిస్పెక్టర్ ఇయాన్ లాట్ పేర్కొన్నారు. తాము అడిగినది ఇవ్వనందుకే పటేల్‌ను ఆ టీనేజర్లు చంపినట్లు వివరించారు. పిన్న వయస్సు వారికి సిగరెట్ అమ్మరాదన్న చట్టం నియమానికి మద్దతుగా నిలిచిన ఒక మంచి వ్యక్తి చేయని నేరానికి బలయిపోయాడని పోలీసు అధికార్లు విచారం వ్యక్తం చేశారు. 18 ఏళ్లు దాటినట్లు రుజువులు చూపాలని ఆ యువకులను దుకాణం కార్మికుడు అంతకు ముందు అడిగాడు. రుజువులు చూపలేక యువకుల బృందం రెచ్చిపోయి ఈ నేరానికి పాల్పడింది.

Comments

comments