Search
Saturday 21 April 2018
  • :
  • :

అనంతగిరి గ్రామస్థులకు న్యాయం చేస్తాం

haris

*మంత్రి హరీష్‌రావు

మనతెలంగా / ఇల్లంతకుంట : కాలేశ్వరం 10 ప్యాకేజిలో భాగంగా అనంతగిరి రిజార్వాయర్ ద్వారా పూర్తిగా ముంపునకు గురవుతున్న ఇల్లంతకుం ట మండలం అనంతగిరి గ్రామస్తులకు ప్రభుత్వం తరుఫున న్యాయం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఇల్లంతకుంట మం డలం అ నంతగిరి ప్రాజెక్టును సందర్శిస్తున్నట్లు రోడ్డు మ్యాప్‌లో అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో ఉదయాన్నే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, డిఆర్‌ఓ శ్యాంప్రసాద్‌లాల్, వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రాజెక్టు సమీపంలో విచ్చేశారు. చివరి నిమిషంలో ప్రాజెక్టును పరిశీలించకుండా కేవలం గ్రామస్థులందరు సిద్దిపేటకు రండి అక్కడ అన్ని విషయాలు చర్చించుకుందామని మంత్రి వెళ్లిపోయాడు. ఉదయం నుంచే వేచిచూస్తున్న ముంపు గ్రామ ప్రజలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. మార్గ మధ్యలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి కాన్వాయ్‌ని ఆపారు. దీంతో మంత్రి వారితో కాసేపు ముచ్చటించారు. అనంతగిరి ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం  స్తామని, వారికి పునరావాసం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు వొరుగంటి ఆనంద్, సిరిసిల్ల డిఆర్‌ఓ శ్యాంప్రసాద్‌లాల్, ఎంపిపి గుడిసే అయిలయ్య, జడ్పీటీసి సిద్దంవేణు, పార్టీ అధ్యక్షుడు గొడుగుతిరుపతి, మల్లేంకిశ్రీనివాస్, కంకటి ప్రభాకర్, తహశీల్దార్ శ్రీనివాస్, గుండముత్తయ్య, చొప్పరి సుధాకర్, పొన్నం శేఖర్, శ్రీనివాస్‌గుప్తా, ఈలశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments