ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో సజీవంగా ఉన్న 512 ఏళ్ల నాటి గ్రీన్లాండ్ షార్క్‌ను డెన్మార్క్‌కు చెందిన జూలియస్ నీల్సన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. బతికున్న సరీసృపాల్లో అతిపురాతనమైనది ఇదంటున్నారు. 18అడుగుల పొడవున్న ఈ ఆడ షార్క్ 1505లో జన్మించింది. ఇది ఏడాదికి ఒక సెంటీమీటరు మాత్రమే పెరుగుతూ ఉంది. కండర కణజాలం, ఎముకలు, డీఎన్ఏలను విశ్లేషిస్తే వందల ఏళ్లుగా చోటుచేసుకున్న కాలుష్యం, వాతావరణ మార్పుల గురించి కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు. కెనడా నుంచి నార్వే వరకు గల అట్లాంటిక్ సముద్రం, స్కాట్లాండులోని సముద్ర జలాల్లో బాగా లోతుల్లో షార్క్‌లు నివసిస్తుంటాయి.