Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

అన్నదాతకు ఊరట

cow

మన తెలంగాణ/తాండూరు : తెలంగాణ ప్రభుత్వం జనవరి నుండి 24 గంటల విధ్యుత్ సరఫరా చేయడం ప్రారంభిండంతో అన్నదాతకు ఉరట లభించింది. వీరితో పాటు పరిశ్రమలకు సైతం 24 గంటల విధ్యుత్ సరఫరా చేయడం పట్ల తాండూరు డివిజన్‌లోని నాపరాయి పాలిషింగ్ యూనిట్‌లుసైతం లాభాలలోకి వస్తాయి.పాలిషింగ్ యూనిట్‌లలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఇప్పటికే వలసలు వెళ్లి పోయారు.కేవలం విధ్యుత్ సమస్యతో గత నాలుగేళ్లుగా నాపరాయి పరిశ్రమ కుప్పకూలింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరిశ్రమలు,వ్యవసాయం ఒక్కసారిగా కోలుకుంటాయి. డిశంబర్ అర్థరాత్రి నుండి తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో ప్రభుత్వం 24 గంటల విధ్యుత్ సరఫరా చేస్తుందని ముఖ్యంగా వ్యవసాయానికి రెండవ పంట పండించే రైతులు దిగాలుగా ఉన్నారు.ప్రభుత్వ నిర్ణయంతో వరి పండించే రైతులు రభి పంటలను సాగు చేస్తున్న రైతులు వరినాట్లకు సిద్దమవుతున్నారు.దీంతో తాండూరు డివిజన్‌లో సుమార్ 750 హెక్టార్లలో వరినాటు మరో 1000 హెక్టార్లతో రబి సాగులోకి వస్తుంది. దీంతో రైతులు రెండవ పంటపై ఆశలు పెట్టుకున్నారు. కేవలం విధ్యుత్ సమస్యతో రైతులు రెండవ పంటకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments