Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

అన్నదాత కన్నెర్ర-సాగునీటి కార్యాలయం ముట్టడి

 

cook

*కార్యాలయం ముందే వంటావార్పు
*ఆత్మహత్యలే శరణ్యమంటూ
పురుగుల మందు డబ్బాలతో ధర్నా

మన తెలంగాణ/తాండూరు : శాంతంగా ఉండే అన్నదాత ఒక్కసారిగా కన్నెర్ర చేశాడు. దీంతో ఏకంగా సాగునీటి కార్యాలయం ముట్టడి చేశారు. తమకు ప్రాజెక్టు నీటిని వదలకుంటే ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటామని పురుగుమందు డబ్బాలతో ధర్నాకు దిగారు.ఈ సంఘటన తాండూరు పట్టణంలోని సాగునీటి కార్యాలయం కార్యాలయం ముందు మంగళవారం జరిగింది.యాలాల మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన రైతులు కుటుంబ సభ్యులతో సహా కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాలతో ధర్నాకుదిగారు. కార్యాలయం ముందే వంటావార్పు చేశారు.గ్రామ సమీపంలో ఉన్న జంటుపల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నా అధికారుల నిర్లక్షంగా కారణంగా తమ పంట పొలాలకు సాగు నీటిని వదలడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు.గతంలో ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మత్తుకు మిషన్‌కాకతీయ పథకం క్రింద రూ.2.50 కోట్లు నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్షంకో పనులు పూర్తి కాలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు.సదరు సాగునీటి అధికారులు మాత్రం బిల్లులు చేశారని అన్నారు.అయితె ప్రాజెక్టులో నీరు ఎందుకు వలదడం లేదని ప్రశ్నించారు.తమకు ఉన్న ఒకే ఆధారం జంటుపల్లి ప్రాజెక్టు నీరని ఇందులో సైతం అధికారులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.నీటివదలే వరకు ఇక్కడి నుండి కదలమని కార్యాలయం ముందే కుటుంభసభ్యులతో కలిసి వంటావార్పు చేశారు.స్పష్టమైన హామి ఇవ్వక పోతే వెంటతెచ్చుకున్న పురుగులమందు సేవించి ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.దీంతో అధికారులు స్పందించి వెంటనే నీటిని వదులుతామని హామి ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Comments

comments