Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

విభజన వల్ల జరిగిన అన్యాయాన్ని వివరించా …

BABU,-MODI

ఢిల్లీ : విభజన వల్ల ఎపికి జరిగిన అన్యాయం గురించి ప్రధాని మోడీకి వివరించినట్టు ఎపి సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మోడీతో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను నెరవేర్చాలని మోడీని కోరినట్టు బాబు వెల్లడించారు. విభజన హామీలు, నిధుల విడుదలపై మోడీకి తాను వినతిపత్రం ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఉమ్మడి ఎపి విభజన హేతుబద్ధత లేకుండా జరిగిందని, ఎపికి తీరని అన్యాయం జరిగిందని, ఈ క్రమంలోనే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, అయితే నిబంధనలు అడ్డుగా ఉన్నందున, ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నాడు చెప్పారని చంద్రబాబు తెలిపారు. ఈ విషయాలన్నింటిపై ప్రధాని మోడీకి వివరించినట్టు ఆయన పేర్కొన్నారు.

AP CM Chandrababu met PM Modi

Comments

comments