Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

రెహమాన్‌కి మరో అరుదైన గౌరవం

AR-Rahman

గ్యాంగ్‌టోక్: అస్కార్ అవార్డ్ విజేత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఆయనను సిక్కిం రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు ఆ రాష్ట్ర సిఎం పవన్ చామ్లింగ్. రాష్ట్ర రాజధాని నగరం గ్యాంగ్‌టోక్‌లోని పాల్జోల్ మైదానంలో జరిగిన రెడ్‌పాండా వింటర్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా ఎఆర్ రెహమాన్ పర్యాటకం, వ్యాపార అంశాలలో ప్రచారకర్తగా ఉంటారని పవన్ వెల్లడించారు. రెహమాన్ సిక్కిం రాష్ట్రానికి ప్రచాకర్తగా ఉండడం ఈ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. తనకి ఇంతటి గొప్ప గౌరవాన్ని కట్టబెట్టిన సిక్కిం ప్రభుత్వానికి రెహమాన్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

AR Rahman has been Named as the Brand Ambassador of Sikkim.

Comments

comments