Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

కో ‘ఢీ’

kodipunjula-kotlata

ఏజెన్సీలో మొదలైన సంక్రాంతి సందడి జోరుగా కోడి పందేలకు ఏర్పాట్లు పందెం కోళ్లు పలు రకాలు సిద్ధమైన వేదికలు, లక్షల్లో బెట్టింగులు ఆదేశాలు భేఖాతర్ 

మన తెలంగాణ / భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. సంక్రాంతిని పురస్కరించుకుని సరదాగా జరుపుకునే కోడిపందేలు ఇప్పుడు పెద్ద జూదంగా మారాయి. భద్రాచలం డివిజన్‌తో పాటుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో సైతం కోడి పందేల కోసంఏర్పాట్లు జోరందుకున్నాయి. వీటి పుణ్యమా అని లక్షల రూపాయలుతగలేసుకుని ఇల్లు, ఒల్లు ప్రతీ ఏటా గుల్ల చేసుకుంటున్నారు. సంక్రాంతిసీజన్ వచ్చిందంటే గ్రామాల్లో లక్షల్లో కోడిపందేల పర్వం కొనసాగుతుంది.ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లుపూర్తయినట్లు తెలుస్తోంది. అక్కడక్కడ ఇప్పటికే పందేలు ప్రారంభమైనట్లుసమాచారం.లక్షల్లో బెట్టింగ్‌లు…కోడి పందేలు.. లక్షల్లో సాగుతుంటాయి. ఇందుకోసం సుమారు రూ.10వేల నుంచి రూ. 50 వేల విలువ గల కోడి పుంజులను ముందుగానేకోనుగోలు చేసి పందేం కోసం సిద్ధం చేస్తారు. పందేం పుంజుకు అందించేఆహారం విషయంలో కూడా పెద్ద ఎత్తున నియమాలు పాటిస్తారు. నానబెట్టిన జొన్నలు, రాగులు, జీడి పప్పు, బాదం పప్పు వంటివి అందిస్తారు.పుంజు ఎక్కువ సేపు భరిలో ఉండి పోరాడేందుకు కసరత్తు చేయిస్తారు.బావులు, చెరుపుల్లో ఈత కొట్టిస్తారు. కోడి పంజును పూర్తిగా నిళ్లలో తడితిసన్నని తీగపై రాత్రంతా ఉంచుతారు. ఇలా కసరత్తులు చేయించి గెలుపుకోసం లక్షల రూపాయలు పట్టుకుని బరిలోకి దిగుతారు జూదగాళ్ళు. కోడిపందేల స్థావరాల వద్ద మందు, మాసం విక్రయాలుసైతం జోరుగా సాగుతుంటాయి. ఆ ఏర్పాట్లలో నిర్వాహకులు నిమగ్నమైనట్లు సమాచారం.సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటుచేసి సంక్రాంతి కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుసమాచారం.

ఆంధ్రప్రదేష్‌లోని పలుప్రాంతాల వారు సైతం ఇక్కడికే కోడిపందేలు ఆడేందుకు కార్లు, ఇతర వాహనాల్లో తరలివస్తున్నట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించి ఇక్కడి నిర్వాహకులు వారితో ఇప్పటికే సంబంధాలు నెరిపి రావాలనే ఆహ్వానాలు పలుకుతున్నట్లు వినికిడి.పందెం కోళ్లు పలు రకాలు …పందెం లోకి దింపే కోళ్లకు వాటి రూపాన్ని బట్టి పలు రకాలు పేర్లుపెడుతుంటారు. కోళ్లు బరిలో ఉన్నప్పుడు కూడా దాని ఆకారం, రంగునుబట్టి పై పందేలు పెద్దఎత్తున పెడుతుంటారు. కాకి,డేగ, తెల్లనెమలి, పూల,నెమలి, గౌడపర్ల, గేరువ, రసంగి, సీతువ, పెట్టమారి, అబ్రాసు వంటి పేర్లతో పిలుస్తుంటారు. అంతే కాకుండా ఈకల రంగులను బట్టి కూడా పేర్లుపెట్టి పిలుస్తుంటారు. బరిలో ఉన్న కోడి పుంజల కాళ్లకు కత్తులు కడుతున్నప్పుడు అక్కడి పరిస్థితి రసవత్తరంగా ఉంటుంది.పేటలో పెంపకం…అశ్వారావుపేట ప్రాంతంలోని పలు మామిడి తోటల్లో పెద్ద ఎత్తున పందేంకోళ్లను పెంచుతున్నట్లు సమాచారం. వీటి కోసం ప్రత్యేక గదులు, ప్రత్యేకబుట్టలు ఏర్పాటు చేసి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు వినికిడి. పెద్ద సలకం కోళ్లను ఇతర ప్రాంతాల నుండి తెప్పించి వాటి ద్వారా సీడ్తయారు చేసుకుని ఉత్పత్తిని సైతం చేస్తున్నట్లు పలువురు అంటున్నారు.పోటీ పడగల స్థాయికి వచ్చిన తర్వాత ఒక్కొక్క పుంజును రూ. 20 వేలనుండి మొదలుకుని రూ. 50 వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.ఏడాది కో సారి సాగే సంక్రాంతికోడి పందేల సమయంలో ఈ కోళ్లకుపెద్ద ఎత్తున గిరాకీ ఉంటుంది.

అంతే కాకుండాపొరుకున్న ఆంధ్ర ప్రదేశ్‌లోని ఉలు ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తునపందేం కోళ్ల పెంపకం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.ఆదేశాల భేఖాతర్…కోడి పందేల నిర్వహణ చట్ట రీత్యా నేరం, సరదా కోసం మూగ జీవులప్రాణాలతో ఆటలాడటం సరైంది కాదని దీనిపై నిషేధాన్ని విధించారు.కానీ కార్లలో సైతం కోడిపుంజులతో దిగి బస్తాల కొద్దీ డబ్బులు వెచ్చించిపందేల్లోపాల్గొంటుంటారు. కోడిపందేలను నిర్వహిస్తే చట్ట పరమైన కఠిన చర్యలుతీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తు న్నప్పటికీ ప్రతీ ఏటా ఈ తంతు యధావిధిగా కొనసాగుతూనే ఉంది.సంక్రాతి సీజన్‌లో కోడి పందేలను అరికట్టడం పోలీసులకు కత్తిమీద సాములాగేమారింది. ప్రతీ సారి పందే లు నిర్వహించే స్థావరాలపైదాడులు చేసి కోళ్లతో పాటు సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాదీనం చేసుకు ని నిర్వాహకులు, జూదగాళ్లపై కేసులు పెడుతున్నప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. జూదాన్ని అరికట్టేందుకు ప్రజల సహాయసహకారాలు కావాలని పోలీసులు మొత్తుకుంటున్నప్పటికీ పట్టించుకునేనాధుడే లేడు. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతులై అనాగరిక చర్యలకుదూరంగా ఉండి జూదాన్ని అరికట్టేందుకు సహకరించాలని పోలీసులుకోరుతున్నారు.

మరో ప్రక్క ఆ శాఖలోని కొందరు జూదానికి సహకరిస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. పందేలు నిర్వహించే క్రమంలో పట్టుపడితే కొద్దిపాటి జరిమానాలు విధించి వదిలేయడం వల్లజూదగాళ్లు సైతం సులువుగా తీసుకుంటున్నారు.ఎపి హైకోర్టు హెచ్చరిక…మూగ జీవాలతో చెలగాటం ఆడరాదని, కోడిపందేలను పూర్తిగా నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఈనేపథ్యంలో భద్రాచలం ప్రాంతానికి అనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందేల నిర్వహణకు అడ్డంకులు ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. కాగా దీనిని దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాన్ని నిర్వాహకులు ఎన్నుకున్నట్లుసమాచారం. అక్కడికి రాకపో కలు సాగించే విధంగా, అక్కడ అన్నిరకాల సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు సిద్దం చేశారు.ఆయా శాఖల నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకుమధ్యవర్తుల ద్వారా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది.జోరందుకున్న కోడి పందేలు

మన తెలంగాణ / చండ్రుగొండ : మండల పరిధిలో రావికంపాడుగ్రామం కేంద్రంగా కోడి పందేల జోరు యదేశ్చగా కొనసాగిస్తున్నారు. కోడిపందేలు, పేకాటపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానాలఅదేశాలు వెలువడ్డాయి. ఆ ఆదేశాలు ఆమలు కావడంలేదని ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. స్థానిక పోలీస్‌లను కళ్ళు కప్పి రావికంపాడు గ్రామంకేంద్రంగా పలు గ్రామాలకు చెందిన పందెం రాయుళ్లు రాత్రి పూటపందేలు కాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పందేల వలనకొన్నికులాలకు చెందిన వ్యక్తులు తీవ్రంగా నష్టపోతున్నారనే వదంతులువెల్ళువెత్తుతున్నాయి. సంబందిత పైఅధికారితో ముందుగానే మాట్లాడుకుని ఈ పందేలు కొనసాగిస్తున్నట్లు మండల వ్యాప్తంగా ప్రచారం
జరుగుతుంది. పందెంపై పెట్టే నగదు వివరాలను పందెం రాయుళ్ళు సెల్ఫోన్ ద్వారా మాట్లాడుకుని ఒప్పందాలు చేసుకుంటునట్లు ప్రచారంజరుగుతుంది. పందెం ఒప్పందం కుదిరిన వెంటనే గ్రామా వీదుల్లో పందెంనిర్వహించి, మరుక్షణమే పందెం రాయుళ్ళు వేరే వీధికి వెళ్ళి అక్కడపందెం వేయడం ఇలా పందేలా స్థావరాలను మార్చుతున్నట్లు గ్రామస్తులుతెలుపుతున్నారు. దీంతో స్థానిక పోలీసులు పందెం రాయుళ్ళను పట్టుకోలేక పోతున్నట్లు సమాచారం. పందెం నిర్వాహకులకు పైఉన్నతాధికారిఅండదండలతో యదేశ్చగా పందెం వేస్తున్న విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా పేకాట సైతం గ్రామంలోని రహస్యా ప్రాంతంలో పెద్ద ఎత్తునఆడుతున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. పండుగ సమయం సమీపిస్తుం
డటంతో కోడి పందేలు, పేకాట జోరుగా మరింత పెరిగే అవకాశాలుఎక్కువగా ఉన్నవని గ్రామాస్తులు ఆంధోళన చెందుతున్నారు.

Comments

comments