Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

మురుగుతున్న సుంకాల సొమ్ము

edit2

వివిధ సుంకాల ద్వారా సమీకరించే నిధులు మురిగిపోతున్నాయంటే ప్రభుత్వ అసమర్ధత వల్లనే అనుకోవాలి. లేదంటే నిజాయితీలోపం వల్ల ప్రభుత్వానికి ఆ సమస్య పట్ల చీమకుట్టినట్టుకూడా లేదనుకోవాలి. ఇటీవల కొన్ని ఏళ్లలో అనేక సుంకాలు, సర్‌చార్జీల మూలంగా కేంద్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం తోడైంది. వీటిలో స్వచ్ఛ భారత్ సుంకం, విద్యా సుంకం, కృషి కళ్యాణ్ సుంకం, పరిశుభ్రత, పరిసరాల సుంకం వగైరా వగైరా ఉన్నాయి. నిర్దేశిత రంగాలలో వాడడానికి ఈ సుంకాలను ఉద్దేశించారు. కొన్ని ప్రాధాన్యరంగాలకు అదనపు నిధుల అవసరం తీర్చడమే లక్షం. సరకుల వారీగా వేరే సుంకాలు, సర్‌చార్జీలు ఉన్నాయి. ఉదాహరణకు– ముడి చమురు పై, బీడీలపై, చక్కెరపై, ఆటోమొబైల్స్‌పై గల సుంకం, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై సర్‌ఛార్జీ వంటివి. ఇటీవలి కాలంలో ఈ సుంకాలు, సర్ చార్జ్జీల వల్ల ఆదాయం భారీ మొత్తంలో పెరిగింది. అందువల్ల వాటి వాడకం ఎలా ఉంది అన్న విషయంపై దృష్టి పెట్టడం అవసరం. 201415లో సుంకాలు, సర్ చార్జీల ద్వారా రూ.75,533కోట్లు ఆదాయం పెరగ గా, 201516లో ఈ వసూళ్లు కలుపుకొని మొత్తం ఆదాయం రూ.83,997కోట్లు అయిందని ఓ అంచనా. 201617 బడ్జెట్ అంచనాలలో ఈ రకం ఆదాయా న్ని భారీగా పెంచాలని సంకల్పించారు. మొత్తం రూ.1,48,031కోట్లు సుంకాలు, సర్‌చార్జీలు రూపే ణా వసూలు చేయాలని లక్షంగా పెట్టుకున్నారు. ఈ అంచనా మొత్తాన్ని ఆ తరువాత సవరించిన బడ్జెట్‌లో రూ.1,57,412కోట్లకు పెంచారు. 201718 బడ్జెట్ ఈ లక్షాన్ని రూ.1,69,662 కోట్లకు పెంచారు. ఇవి అతిపెద్ద మొత్తాలు అనడంలో సందేహం లేదు. అందుచేత వసూళ్లను పెంచుతూ నిధుల వాడకాన్ని తగ్గించడాన్ని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) విమర్శించారు. ఇలా చేయడం వల్ల ఆయా నిర్దేశిత రంగాలకు ప్రత్యేక సుంకాలు, సర్‌ఛార్జీలు వసూలు చేసిన లక్షం నెరవేరటం లేదని కాగ్ తన నివేదికలో తప్పుపట్టింది. అత్యవసరంగా సుంకం వసూలు చేయడం సాగిస్తూ, అలా వచ్చిన ఆదాయా న్ని సరిగా ఖర్చు చేయకపోవడం ఏమిటని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తారని కూడా కాగ్ హెచ్చరించింది.
సాంకేతిక విజ్ఞాన సుంకం కూడా అంతే!
దిగుమతి చేసుకున్న సాంకేతిక విజ్ఞానంపై ‘పరిశోధనఅభివృద్ధి సుంకం’ విధించారు. ఆ మొత్తా న్ని దేశీయ సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించారు. ఇది ఎంతో ప్రశంసనీయమైన లక్షం. అయితే ఆ సుంకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపూర్తిగా ఖర్చు పెట్టలేదని తెలిస్తే ఎవరికైనా విస్మయం కలగక తప్పదు. 199697నుంచి 2016 17మధ్య రెండు దశాబ్దాల కాలంలో ఈ సుంకం ద్వారా రూ.7,885కోట్లు వసూలు చేశారు. అందు లో కేవలం రూ.609కోట్లు మాత్రమే సాంకేతిక అభివృద్ధి బోర్డుకు విడుదల చేశారు. తక్కిన రూ.7,226కోట్లు అసలు వినియోగించలేదు. అటువంటి అత్యధిక ప్రాధాన్యత గల రంగంలో 90 శాతం నిధులు మురిగిపోతున్నాయంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించుకోవచ్చు. స్వచ్ఛ భారత్ వంటి విశేష ప్రచారం చేసిన పథకం విషయంలో కూడా పట్టణ పారిశుద్ధ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేయకుండా మురగబెడుతున్నారు.
201516, 201617 రెండేళ్లకాలంలోస్వచ్ఛభారత్ సుంకం ద్వారా రూ.16,401కోట్లు వసూలు చేశారు. ఈ పథకానికి రూ.4,001కోట్ల రూపాయలను ఖర్చు చేయకుండా మురగబెట్టారు. ఇది వసూ లు చేసిన మొత్తంలో 25శాతం. కేంద్ర రోడ్ల నిధి (సెంట్రల్ రోడ్ ఫండ్), ఇంధన సుంకం వంటి ఇతర సుంకాల ఆదాయాన్ని కూడా తగినంతగా ఖర్చు చేయడం లేదు. ఇలా మురిగిపోతున్న నిధులు ఆయా రంగాలకు కూడా హెచ్చుగానే ఉండడం ఆశ్చర్యకరం. అత్యవసర దార్శనికత ప్రదర్శించి జాతీయ పథకాలకు, ప్రాధాన్య కార్యక్రమాలకు సుంకాలను వసూలు చేసినప్పటి చిత్తశుద్ధిని వాటిని ఖర్చుచేసి లక్షాలు అందుకోవడంలో చూపటంలేదు. ఇది అత్యంత అసమర్థతకు నిదర్శనంగా ఉంది. లేదా ఆయా పథకాల అమలు పట్ల చిత్తశుద్ధి లోపానికి ఇలా నిధులు మురిగిపోవడం ఒక ఉదాహరణ కావ చ్చు. అందువల్ల ప్రత్యేకంగా వసూలు చేసే సుంకాలు, సర్‌ఛార్జీలపట్ల ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. బీడీలు, పాన్‌పరాగ్‌లు వంటి అనారోగ్యకర సరుకులపై వసూలు చేసే వివిధ సుంకాలకు ప్రజారోగ్యంపట్ల ఆందోళన వలనే అనే సమర్థింపు చేసుకోవచ్చు. కానీ ఆ ఆదాయాన్ని మురగబెడుతున్నారంటే ప్రజారోగ్యంపట్ల శ్రద్ధ లేదనడానికి నిదర్శనం.
కేంద్రానికే ఈ అదనపు ఆదాయం
ఇలా వసూలయ్యే మొత్తాలు కేంద్ర ప్రభుత్వానికే దక్కుతాయి. ఎందుకంటే రాష్ట్రాలతో పంచుకునే పన్నుల ఆదాయం కాదది. అంటే సుంకాలు, సర్
ఛార్జీల ఆదాయం పెరిగిన కొద్దీ రాష్ట్రాలు, కేంద్రం పంచుకునే ఉమ్మడి ఆదాయం తరిగిపోతున్నట్లే. ఫిబ్రవరిలో ఎన్నికల బడ్జెట్ దిశగా మనం పయనిస్తున్నాం. ఈ నేపథ్యంలో వివిధ సుంకాలు, సర్‌ఛార్జీల ద్వారా సమకూరే ఆదాయాన్ని సరిగా ఖర్చు చేయాల్సిన అవసరాన్ని కేంద్రానికి గుర్తు చేయవలసి ఉంది. ప్రభుత్వం ఒక పక్క ఆర్థిక మాంద్యంతో కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధులను కేంద్రం ఎలా సమీకరిస్తుందని ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. 2018లో జిడిపి కూడా 6.5శాతానికి తగ్గిపోతుందని అంచనాలు వెలు వడుతున్నాయి. ఇది గత నాలుగేళ్లలో తక్కువ జిడిపి కాగలదు. ఇటువంటి పరిస్థితిలో వివిధ సుంకా లు, సర్‌ఛార్జీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సక్రమంగా వినియోగించకుండా కేంద్రం నిర్లక్షం వహించడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి తన పార్టీ ఎజండా పట్ల ఉన్న చిత్తశుద్ధి ఆర్థిక రంగాన్ని చక్కదిద్దడంపై లేదని వినిపిస్తున్న విమర్శలను నిజం కాకుండా కేంద్రం జాగ్రత్త వహించాలి.
* భరత్ డోగ్రా

Comments

comments