Search
Friday 20 April 2018
  • :
  • :

ఫోనేరియా

ph

అబ్బబ్బ ఈ వెధవ ఫోన్ నాకు ఒక శత్రువులా తయారైంది. కూర్చోనివ్వదు, నిల్చోనివ్వదు… అన్నం తిననివ్వదు… నిద్రపోనివ్వదు …ఆఖరికి సరదాగా జలకాలాడనివ్వదు… ఛ విసుగొచ్చేస్తోంది … విసిరి హుస్సేన్ సాగర్ లో పడేస్తే వదిలిపోతుంది..
వచ్చిండే … వచ్చిండే మెల్ల, మెల్లగా వచ్చిండే … క్రీము బిస్కెట్ ఏసిండే…
అదిగో మోగింది….. క్షణం గ్యాప్ ఇవ్వదు కదా… ఎవరో…. అరె భవ్య …. హాయ్ భవ్యా … హౌవార్యు… ఆఫ్టర్ లాంగ్ టైం …నన్ను మర్చి పోయావా? అవునులే ఎందుకు గుర్తుంటాము… నువ్వు పెద్ద సెలెబ్రిటివి కదా… మేమెందుకు గుర్తుంటాం… టివి ఆన్ చేస్తే నువ్వే కనిపిస్తున్నావట సంధ్య చెప్పింది… అన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయే నీకు… అవునూ పెళ్లి చేసుకున్నావా … ఏంటి లాస్ట్ మంత్ చేసుకున్నావా… బాప్ రే.. ఇంత లేట్ గానా .. వాట్? సెకండ్ మారేజ్ … ఫస్ట్ డైవోర్స్ అయిందా… అయ్యయ్యో అదేంటే.. ఏంటి? నో వర్రినా …
అయినా ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్తే సాల్వ్ చేసేదాన్నిగా.. అసలు ఫోన్ చేసి ఎంతకాలం అయింది? ఏంటి నాకు లాస్ట్ వీక్ నువ్వు ఫోన్ చేసావా… కొయ్ కోయ్ … నన్ను నమ్మమంటావా .. ఏంటి ఎంగేజ్ వచ్చిందా .. ఇంపాజిబుల్ … నా ఫోన్ అసలు ఎంగేజ్ వచ్చే ప్రసక్తే లేదు… నాకెవరు చేస్తారే బాబూ … నువ్వంటే సెలబ్రిటీ కాబట్టి నీ ఫోన్ నిరంతరాయంగా మోగుతూనే ఉంటుందేమో …సరే, సరే ఇంతకీ ఏంటి విశేషాలు…. ఎలా ఉన్నావు? కొత్త సీరియల్ ఏదన్నా ఒప్పుకున్నావా? ఏంటి ఇప్పుడు చేతిలో మూడున్నాయా… ఏమేవిటి? జీడిపాకం, బబుల్గం, చైనీస్ నూడుల్స్… భలే ఉన్నాయే పేర్లు… అవునూ బబుల్గం సీరియల్ ఎప్పుడో నా పెళ్లి కాకముందే చేసావుగా… సెకండ్ పార్టా .. కాదా అదేనా …అదేంటే … నా పెద్ద కొడుక్కి నిన్ననే పది నిండి పదకొండు వచ్చింది…. నా పెళ్లి టైంకి నీ సీరియల్ పదహారో భాగం వస్తోంది.. నాకు పెళ్లి అయిన రెండేళ్ళకి పుట్టాడు వాడు.. ఒకటిన్నర , రెండు మూడున్నర, పది, మైగాడ్ దాదాపు పదమూడేళ్ళు దాటింది… ఇంకా అవలేదా … ఏంటి మన జీవితంలో లాగా సీరియల్స్ లో కూడా తరాలు మారాలా … బాబోయ్ జనాలు చూస్తారా. సహజత్వానికి దగ్గరగా ఉండడానికి అలా తీస్తారా … అదేం సహజత్వం నా బొంద … ఇంతకీ ఏంటి ఎందుకు విడాకుల దాకా వచ్చింది.. లవ్ మారేజ్ చేసుకున్నావా… ఓ మరి లవ్ మారేజ్ ఎందుకు ఫెయిల్ అయింది? జాతకాలు చూసుకోలేదా? ఏంటి ఈ రోజుల్లో అవన్నీ చూడడం లేదా … ఎన్ని విల్లాలు …ఎన్ని ఎఫ్‌డి లు, ఆడి కారు … చూస్తున్నారా.. మరి పోనీ అవన్నీ అయినా చూసుకోకపోయావా.. ఏంటి అవన్నీ ఉన్నాయా.. మరి విడాకులెందుకిచ్చావే …అవన్నీ పోయినట్టేగా …అయినా చేసుకునే ముందే అన్నీ చూసుకోవద్దూ..పెళ్ళంటే మామూలు విషయం కాదుగా … కులం, మతం, కుటుంబం ఎన్ని చూడాలి? నీలాంటి వాళ్ళు తొందరపడి , కులం , మతం.. అన్నీ ట్రాష్ అంటూ పెళ్ళిళ్ళు చేసుకుని తరవాత నీ కులం ఇలాంటిది, మా కులం అలాంటిది అని మాటల ఈటెలు విసురుకుంటూ విడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు! అన్నంత ఈజీ కాదమ్మా.. పెళ్ళంటే నూరేళ్ళ పంట … ఏంటి కాదా …. నిర్వచనం మారిపోయిందా… ఏమని … మూడేళ్ళ క ….కా … కాంట్రాక్టు… అయినా విల్లాలు, ఎఫ్‌డిలు చూసుకుని చేసుకున్న దానివి అవి కూడా పోయినట్టేగా.. నీ ఖర్మ … ఏంటి అవి నీకు నష్టపరిహారంగా తీసుకున్నావా? హలో, హలో అబ్బ దిక్కుమాలిన ఫోన్ కట్ అయి చచ్చింది… ఏం చెప్పిందో భవ్య … వెధవ ఫోన్ … వేధవ ఫోన్ అని… ఛ కలిసి చావడం లేదు.. నాట్ రీచబులట … ఎక్కడుందో మహాతల్లి… కలవదేంటి బాబో … ఒసేయ్ ఫోనా నా తల్లి కదూ ఒక్కసారి కలవ్వే … అదేదో చెప్పింది …పూర్తిగా తెలుసుకునేదాకా నాకు మనశ్శాంతి లేదు… అయ్యయ్యో ఫోన్ కింద పడింది… అబ్బా పని చేయడం లేదు.. ఎలా ఇప్పుడు … ఫోన్ లేకపోతే నా లైఫ్ స్తంభించినట్టే …

Comments

comments