Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

సివిల్స్ వైపే యూవత చూపు…

civil

సివిల్స్ పరీక్షలను బ్రహ్మపదార్థంగా చూడటం మానుకొని నిర్దిష్ట సిలబస్‌లో నిమగ్నమైతే సాధించడం తేలిక. ఎంపిక చేసుకొనే పాఠ్యాంశం మార్కులను స్కోర్ చేసే విధంగా ఉంటే ప్రిలిమనరీతోపాటు మెయిన్స్‌లో విజయం సాధించవచ్చని కృష్ణప్రదీప్స్ 21 సెంచరీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు భరోసా ఇస్తుంది. 2003 నుంచి సివిల్స్‌కు కోచింగ్ ఇచ్చి వందలాది మందిని సివిల్స్ అధికారులుగా తీర్చిదిద్దిన ఈ కోచింగ్ సెంటర్ చీఫ్ కోఆర్డినేటర్ ఏ.మహేందర్ రెడ్డి గమ్యంతో చెప్పిన వివరాలు.

ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్న కోర్సులేవి? మీరు ఇచ్చే కోచింగ్ ఎలా ఉంటుంది?
ప్రస్తుతం చాలా వరకు యువత సివిల్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్.ఎస్,ఐ.ఎఫ్.ఎస్ లకు డిమాండ్ పెరుగుతుంది. రాష్ట్ర విభజనతో ఉద్యోగావకాశాలు పెరగడంతో అత్యధికంగా విద్యార్థులు గ్రూప్ వన్, గ్రూప్ టూ వైపు ఆసక్తి చూపుతున్నారు. కానీ కొంతమంది సివిల్స్ కఠినంగా ఉంటుంది ఇంగ్లీషులో పరీక్ష రాయాల్సి వస్తుంది. సివిల్స్ స్థాయిని అందుకోలేమనే అభిప్రాయంతో ఉన్నారు. రకరకాల అపోహల వల్ల గ్రూప్ 1,2 వైపునకు చూస్తున్నారు.
సివిల్స్ పూర్తిగా ఇంగ్లీషులోనే రాయాల్సి ఉంటుందా?
సివిల్స్‌కు ప్రిలిమనరీ పరీక్ష తప్పనిసరిగా ఇంగ్లీషులోనే రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ తెలుగులో రాసే అవకాశం ఉంది. అయితే ప్రిలిమనరీ ఇంగ్లీషులో రాసి మిగతా పోటీని ఎదుర్కొనే బదులు సివిల్స్ స్థాయిలో ఉండే గ్రూప్ 1,2 పరీక్షలు తెలుగులో రాసి తొందరగా ఉద్యోగ అవకాశం పొందవచ్చనే ఆలోచనలు అభ్యర్థుల్లో వ్యక్తం అవుతుంటాయి.
సివిల్స్ కోచింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమౌతుంది?
విద్యార్థి డిగ్రీ కాగానే జూన్ నుంచి కోచింగ్ ప్రారంభిస్తాం.18 నెలలపాటు కోచింగ్ ఉంటుంది. ప్రిలిమనరీ తర్వాత మెయిన్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ఇంటర్వ్యూలకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను తీర్చిదిద్దుతుంటాం.
సబ్జెక్టును ఎలా ఎంపిక చేసుకుంటే మార్కుల స్కోర్ సాధించవచ్చు?
సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం అనేది సివిల్స్‌లో చాలా ముఖ్యం. సాధారణంగా ఒక సబ్జెక్టు ఎంపిక చేసుకునే ముందు లాభనష్టాలు అంచనా వేయాలి. జనరల్ స్టడీస్‌లో ఎంతవరకు కవర్ చేయగలమో చూడాలి.ఇప్పటివరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జనరల్ స్టడీ, ఆంత్రోపాలజీ, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్, పొలిటికల్ సైన్స్, హిస్టరీలో మార్కులు వస్తాయి. అలాగే ఫ్యాకల్టీ సూచనలు తీసుకుని సబ్జెక్టును ఎంపిక చేసుకుంటే మరింత సులువుగా ఉంటుంది. ముఖ్యమైన సబ్జెక్టు నుంచే స్కోరింగ్ సంపాదించేది.
మెయిన్స్ అనంతరం ఇంటర్వూ ఎలా ఉంటుంది?
ఇంటర్వ్యూ అనగానే కంగారు పడుతుంటారు. నిజానికి కంగారు పడాల్సినంతగా ఉండదు. అడిగే ప్రశ్నలతో పాటు వ్యక్తిత్వ పరిశీలన ఉంటుంది. ఇంటర్య్వూకు వెళ్ళే ముందు సాధారణ అంశాలతోపాటు సొంత ఊరు ప్రాముఖ్యత, పేరు అర్థం, నిర్థిష్ట లక్ష్యాలు, సాధారణ విజ్ఞానంపై ఉన్న అవగాహనను ఇంటర్వ్యూ చేసే యు.పి.ఎస్.సి బోర్డు సభ్యులు పరిశీలిస్తారు. సివిల్స్ కోసం ప్రతివ్యక్తి సుమారు 12 గంటలు చదవాల్సి వస్తుండటంతో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది.
ఒక విద్యార్థి ఎన్నిసార్లు సివిల్స్ రాసే అవకాశం ఉంటుంది?
ఒ.సి అభ్యర్థి 21 నుంచి 32 సంవత్సరాల వరకు 6సార్లు, ఒ.బి.సి 21 నుంచి 35 సంవత్సరాల వరకు 9 సార్లు, ఎస్సీ,ఎస్టీ 21సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల వయస్సు వరకు ఎన్ని పర్యాయాలైన సివిల్స్ పరీక్షలు రాయవచ్చు.
2017 సివిల్స్ మెయిన్స్‌లో కొన్ని మౌలిక మార్పులు చేసినట్లు తెలుస్తుంది?
యూపిఎస్సీ అక్టోబర్ 28, 2017 నుంచి నవంబర్ 3, 2017 తేదీల్లో సివిల్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. జనరల్ స్టడీస్, ఆప్షనల్ రెండింటిలో కొన్ని గుణాత్మకమైన మార్పులు చేసింది. జనరల్ స్టడీస్‌లో 150 పదాలతో రాయాల్సిన 10 మార్కుల ప్రశ్నలను, 250 పదాలతో రాయాల్సిన 15 మార్కుల ప్రశ్నలను కలిపి అడిగారు. అయితే కోచింగ్ తో సివిల్స్ సాధించవచ్చు. అదే జ్ఞానంతో సివిల్స్‌తో సమానమైన గ్రూపులను సాధించవచ్చనే దూరదృష్టితో విద్యార్థులు తీసుకుంటున్న శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది.

Comments

comments