Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఆస్ట్రోనాట్ యంగ్ కన్నుమూత

Austronau

హూస్టన్ : చంద్రునిపై నడిచిన ఆస్ట్రోనాట్ జాన్ యంగ్ (87) శనివారం రాత్రి కన్నుమూశారు. ఆరుసార్లు ఆయన అంతరిక్షంలోకి వెళ్లారు. శనివారం ఆయన మృతి చెందినట్టు నాసా వెల్లడించింది. ఆయన మృతికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. 1972లో ఆయన చంద్రునిపై అడుగు పెట్టారు. ఈ ఘనత సాధించిన 12 మందిలో ఆయన ఒకరని నాసా తెలిపింది. జాన్ యంగ్ మృతిపై నాసా సంతాపం ప్రకటించింది. 1962 నుంచి ఆయన నాసాతో కలిసి పని చేయడం ఆరంభించారు. నాసాలో 42 ఏళ్లు పని చేసిన యంగ్ 2004లో రిటైరయ్యాడు. నాసా కళ్లుగప్పి తనతో పాటు బీఫ్ శాండ్‌విచ్ తీసుకెళ్లాడు. నాడు ఇది పెద్ద వివాదానికి దారితీసింది. యంగ్ మృతిపై పలువురు ఆస్ట్రోనాట్‌లు సంతాపం వ్యక్తం చేశారు.

Astronaut John Young passes away

Comments

comments