Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అత్తారింటి వేధింపులు తాళలేక…

manjula-body
మన తెలంగాణ/జహీరాబాద్ ః కష్టకాలంలోనే అండగా ఉంటానని, నూరేళ్ల జీవితాన్ని సాఫీగా సాగిస్తానని పచ్చని పందిరిలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు చేస్తుండగా బంధు, మిత్రుల సాక్షిగా ప్రమాణం చేసిన ఆ మగాడు పారాణి ఆరక ముందే కష్టాలంటే ఏంటో రుచి చూపించడం ప్రారంభించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన సంఘటన సోమవారం రాత్రి జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ ప్రభాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… పట్టణంలోని ఎస్‌బిహెచ్ కాలనీలో నివాసం ఉండే సురేందర్‌రావు కుల్‌కర్ణికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 27-4-2016న ఇబ్రహింపట్నంకు చెందిన శేషవర్ధన్‌తో కట్న కానుకలు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వివాహం అయ్యాక ఒక నెల పాటు భార్యతో సంసారం చేశాక పని నిమిత్తం కెనెడా దేశానికి వెళ్లిపోయాడు. భర్త ఇతర దేశాలకు వెళ్లిపోయినా అత్తారింట్లోనే ఉంటున్న మంజులపై అత్తామామల వేధింపులు మొదలయ్యాయి. విషయం భర్తకు తెలిసినా తన తల్లిదండ్రులనే ప్రోస్తాహిస్తూ రావడమే కాకుండా తను సైతం వేధింపులు చేయడం మొదలు పెట్టాడు. విషయం తెలుసుకున్న తండ్రి సురేందర్‌రావు తన కూతురిని తన ఇంటికి తీసుకువచ్చి సాకుతున్నాడు. విదేశాల్లో ఉన్న భర్త శేషవర్ధన్ ఫోన్‌లో (కాన్ఫరెన్సులో) వేధించడం షురు చేశాడు. అప్పట్లోనే జహీరాబాద్‌లో పంచాయితీ నిర్వహించి విడాకుల వరకు చేరుకున్నారు. విడాకుల కొరకు జహీరాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. విడాకుల కేసు ఇటీవలే వాయిదా పడింది. మంజుల ఏమనుకుందో ఏమో తెలియదు కాని జీవితంపై విరక్తి పెంచుకుంది. సోమవారం పరమేశ్వరుని దినం కావడంతో మంజుల మినహా మిగతా వారంతా మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసిన మంజుల ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో మంటలు రేగుతున్న విషయాన్ని పసిగట్టిన బద్రపప్ప, సుభాష్‌కుల్‌కర్ణిలు విషయాన్ని సురేందర్‌రావుకు ఫోన్‌లో సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మంజుల కుటుంబ సభ్యులు హుటాహుటిన స్వగృహానికి చేరుకోగా అప్పటికే మంజుల శరీరం పూర్తిగా కాలిపోయి మరణించింది. విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగ సిఐ నాగరాజు, ఎస్‌ఐ ప్రభాకర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ప్రభాకర్ వివరించారు.

Comments

comments