Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

రహానెను తప్పించడం పొరపాటే…

d

సెంచూరియన్: తొలి టెస్టులో అజింక్య రహానెను తప్పించి భారత జట్టు భారీ మూల్యమే చెల్లించుకుందని దక్షిణాఫ్రికా దిగ్గజం అలన్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రహా నె బరిలోకి దిగి ఉంటే ఫలితం కచ్చితంగా భారత్‌కు అనుకూలంగా ఉండేదన్నాడు. పుజారాతో కలిసి అతను నెలకొల్పే భాగస్వామ్యాలు భారత్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయాన్ని డొనాల్డ్ గుర్తు చేశాడు. అతన్ని ఎందుకు పక్కన బెట్టారో తనకైతే ఇప్పటికీ అంతు బట్ట డం లేదన్నాడు. బౌన్సీ పిచ్‌లపై సమర్థంగా రాణించే బ్యాట్స్‌మెన్‌లలో రహానెకు తాను అగ్రస్థానం ఇస్తానని డొనాల్డ్ అన్నాడు. అటువంటి బ్యాట్స్‌మన్‌ను తుది జట్టుకు ఎంపిక చేయక పోవడం పెద్ద పొరపాటేనని పేర్కొన్నాడు. ఇక, రానున్న మ్యాచుల్లో కోలుకోవడం భారత్‌కు అంత సులువు కాదని డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు.

Comments

comments