Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

ఉద్యోగ హామీ పథకంపై అవగాహన

clctr2

 18న ప్రధానమంత్రి ఉద్యోగ హామీ పథకంపై నిరుద్యోగులకు అవగాహన సదస్సు: కలెక్టర్ శ్వేతామహంతి

వనపర్తి ప్రతినిధి: ప్రధానమంత్రి ఉద్యోగ హామీ పథకంపై నిరుద్యోగులకు అవగాహన కల్పించేందుకు గాను ఈనెల 18న మధ్యాహ్నం 2 గంటలకు వనపర్తిలోనిదాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించను న్నట్లు కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. బుధ వారం తన ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్ర మల ప్రోత్సాహక కమిటీ మరియు టిఎస్ ఐపాస్ జిల్లా స్థాయి కమిటి సమావేశంలో మాట్లాడుతూ ఈ పథకం కింద 30 యూనిట్ల లక్షానికి గాను 61 దరఖాస్తులు వచ్చాయని,అయితే మరింత మందికి అవకాశం కల్పించడంతో పాటు సరైన యూనిట్లు నెలకొ ల్పేందుకు గాను ముందుగా నిరుద్యోగులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు . ఇందులో భాగంగానే అవగా హన సదస్సు నిర్వహిస్తున్నామని , ఈఅవగాహన సదస్సుకు కళాశాల విద్యా ర్థులు, ఇంజనీరింగ్‌డిప్లమో చేసిన విద్యార్థులు తదితరులను పిలవాలని చెప్పారు. దీనిపై ఒక కరపత్రం ముద్రించాలని ఆదేశించారు. టిఎస్ ఐపాస్ కింద పరిశ్రమల ఏర్పాటుకు స్వీకరించిన దరఖాస్తులకు అనుమతి మంజూరు చేయడంలో సంబంధిత శాఖలతో వ్యక్తి గతంగా సంప్రదించి త్వరిత గతిన అనుమతులిచ్చేలా చూడాలని, జిల్లా పరిశ్రమల శాఖా ఇంచార్జి జిల్లా మేనేజర్ సురేష్ కుమార్‌ను ఆదేశించారు.గత డిశంబర్ మాసానికి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ రాయితీ పథకం కింద మొత్తం 11 దరఖాస్తులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి వచ్చాయని, అందులో ఎస్‌సి , టిఎస్‌పి, ఒక పిహెచ్‌సి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.యూనిట్ల గ్రౌండింగ్ కోసం ఎంపిడిఒలకు ముందుగా లేఖలు రాయా లని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకై ఇది వరకు దరఖాస్తు చేసుకుని ఆయా కారణాల చేత పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ పి.చంద్రయ్య, డిపిఒ వీరబుచ్చయ్య, ఎల్‌డిఎం సురేష్‌కుమార్, ఆర్డీఒ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments