Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సంక్రాంతికి ముందే…పందెం కోళ్లు

kodi

* అటవీ ప్రాంతంలో జోరుగా సాగుతున్న జూదం * విచ్చలవిడిగా బెట్టింగ్‌లు
* బాబాపూర్‌లో కోడి పందాల నిర్వాహకుల అరెస్టు * పోలీసులు దాడి చేస్తున్నా ఆగని ఆట

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : సంక్రాంతి పండగకు ముందే పందెం కోళ్లు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. కొందరు వ్యక్తులు విచ్ఛలవిడిగా ప్రాణహిత నది శివారులోని అటవీ ప్రాంతంలో కోడిపందాలను నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయల బెట్టింగ్‌తో సాగుతున్న జూదంపై పోలీసు అధికారులు స్పందించనప్పటికీ యథేచ్ఛగా పందాలు నిర్వహిస్తున్నారు. మహరాష్ట్ర నుంచి వస్తున్న వ్యక్తులతో పాటు ఈ ప్రాంతానికి చెందిన వారు జోరుగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.
కోడి పందాలు నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసినప్పటికీ కోడిపందాల ఆటకు తెరపడడం లేదు.
ఇటీవల కౌటాల మండలం బాబాపూర్ గ్రామపంచాయతీ లంబాడీ హెట్టి అటవీ ప్రాంతంలో కోడిపందాలు నిర్వహిస్తున్న 9 మందిని కౌటాల పోలీసులు అరెస్టు చేశారు. రూ. 4,500 నగదుతో పాటు, 8 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలతో పాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట, బెజ్జూ ర్ మండలాల్లోని అటవీ ప్రాంతాలతో పాటు ప్రాణహిత నది శివారులో కోడిపందాల జూదంవిచ్ఛలవిడిగా నిర్వహిస్తున్నారు. కోడిపందాల వ్యవహారంలో పోలీసు అధికారులు నిఘా ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని ప్రాం తాల్లో పోలీసుల కళ్లు కప్పి దట్టమైన అటవీ ప్రాంతంలో జూదం నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం కూడా నెన్నెల, కౌటాల మండలాల్లో పోలీసు అధికారులు దాడులు చేసి, కోడిపందాల నిర్వాహకులను, జూదర్లను అరెస్టు చేసినప్పటికీ ఈఏడాది సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందాల జూదం సాగుతుంది. అటవీ ప్రాంతాల్లో లక్షలాది రూపాయలు బెట్టింగ్‌లు నిర్వహించి కోడి పందాల్లో పాల్గొంటున్నారు. కొందరు కోడి పందాల ఆటకు వ్యసనపరులుగా కావడంతో ప్రతి ఏడాది జూదం యథేచ్ఛగా సాగుతుంది. మహారాష్ట్ర నుంచి వేలాది రూపాయలు వెచ్చించి పందెం కోళ్లను తీసుకువచ్చి సరిహద్దులలో జూదం నిర్వహిస్తున్నారు. అటవీప్రాంతాల్లో పోలీసులు డ్రోన్‌కెమెరాలు అమర్చకపోవడంతో విచ్ఛ లవిడిగా జూదం సాగుతుంది. ఇప్పటికైనా కోడిపందాల నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments