Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

నమ్మించి మోసంచేశాడు

cheat
* మిత్రుని భార్యతో అక్రమసంబంధం
* గర్భవతి అయ్యాక కాదంటున్న ప్రియుడు
* న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు

మన తెలంగాణ/పాల్వంచ ః మిత్రుని భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడో ప్రబుద్దుడు. సవ్యంగా సాగుతున్న కాపురాన్ని కూల్చాడు. విషయం తెలిసిన భర్త భార్యను వదిలేసాడు. తాను తోడుగా ఉంటానని నమ్మబలికాడు. తీరా కడుపు చేసాక కాదు పొమ్మంటున్నాడు. న్యాయం చేయాలని బాధితురాలు గ్రామీణ పోలీస్‌స్టషన్‌లో ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం…. మండల పరిధి దంతెలబోర గ్రామానికి చెందిన వేల్పుల భూషణం, విజయలక్ష్మి దంపతుల కూతురు సమ్మక్కను గత నాలుగేళ్ళ క్రితం తూర్పుగోదావరి జిల్లా కుక్కునూరు మండలం మిట్టగూడెంకు చెందిన నాగరాజుతో వివాహం జరిపించారు. వీరికి రెండేళ్ళ పాప ఉంది. నాగరాజు మిత్రుడైన అదే గ్రామానికి చెందిన గాడిద శ్రీనివాస్ భద్రాచలం ఆర్‌టిసి డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ సమ్మక్కతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. రెండేళ్ళ క్రితం విషయం నాగరాజుకు తెలియడంతో భార్యను వదిలేసాడు. సమ్మక్క పుట్టిళ్లుయిన దంతెలబోరకు వచ్చేసింది. నావల్లే కాపురం చెడిపోయింది కాబట్టి తాను పెళ్ళిచేసుకుంటానని నమ్మించాడు శ్రీనివాస్. అప్పటి నుండి సమ్మక్క వద్దకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. దీంతో సమ్మక్క గర్భం దాల్చింది. పెళ్ళిచేసుకోమని నిలదీసింది. దీంతో మొహం చాటేసాడు. తనకు న్యాయం చేయాలని గత నెల 18న గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అప్పటినుండి శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు శ్రీనివాస్‌ను పట్టుకున్న పోలీసులు శ్రీనివాస్‌ను విచారించారు. డిశంబర్ 23న మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామానికి చెందిన మరో యువతిని పెళ్లిచేసుకున్నానని తనకు సమ్మక్కకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు తెలిపాడు. ఇదిలా ఉండగా శుక్రవారం బిసియం రోడ్‌లో ఓ హోటల్ వద్ద సమ్మక్క శ్రీనివాస్‌ను పట్టుకొని నిలదీసింది. రూ. 50 వేలు ఇస్తా… నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని శ్రీనివాస్ అనడంతో సమ్మక్క శ్రీనివాస్‌ను చితకబాదింది. తన చున్నీతో బిగించి బంధువుల సహాయంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments