Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

అంతా మా ఇష్టం

biru

*బెల్ట్ షాప్ ల పై చర్యలకు వెనుకంజ వేస్తున్న ఎక్సైజ్ శాఖ
*కళ్ళు మూసుకొని కథ నడుపుతున్న
 అధికారులు
*నెలసరి ఆదాయవనరుల పైనే అధికారుల దృష్టి
*అధికారుల అండదండలతో అడ్డగోలుగా దోపిడీ
*పేదల పాలిట శాపంగా మారిన బెల్ట్ షాప్‌లు

ఏర్గట్ల: విచ్చల విడిగా గ్రామ గ్రామాన బెల్ట్ షాప్‌లు నడుస్తున్నా మేము పట్టించుకోము, మేము అనుకుంటేనే ఏదైనా చేయగలం. అంతా మా ఇష్టం అనే విధంగా మారింది ఎక్సైజ్ శాఖ పనితీరు. మండలం పరిధి గ్రామాల్లో బహిరంగంగా వేలం పాటలు వేసి బెల్ట్ షాప్‌లను దక్కించుకొన్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ ఏమి తెలియనట్లు వ్యవహరిస్తూ అసలు గ్రామాల్లో బెల్ట్ షాప్ లే లేవు అని చెపూతూ నిక్కచ్చిగా చెపుతున్న ఎక్సైజ్ శాఖ కళ్ళు తెరిపించడం ఎవరితనం కావడం లేదు. ఒకవేళ బెల్ట్ షాప్ నిర్వహణపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాకేమి తెలియదు, బెల్ట్ షాప్ నిర్వాహకులనే అడిగి తెల్సుకొండి అని బెదరించడంతో పక్కా ప్రణాళికా బద్ధ్దంగా వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రతి గ్రామంలో మండల కేంద్రంలో గల వైన్స్ యాజమాని తెరవెనుక ఉండి బెల్ట్ షాప్‌లను నడుపుతున్న విషయం ఎక్సైజ్  నెలసారి టార్గెట్ పూర్తి చేయడం కోసం సంబంధిత అధికారులు కళ్ళు మూసుకొని దర్జాగా పనులను చక్కబెట్టుతున్నట్లు అర్థమవుతుంది. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు రెండు రోజులు మౌనంగా ఉంటూ మళ్ళీ యదతథంగా బెల్ట్ షాప్‌లు అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరిపినా అటు వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కనబడటం లేదు. కొన్ని రోజులుగా బెల్ట్ షాప్‌లపై తీవ్ర విమర్శలు తలెత్తినా జిల్లా అధికారులు సైతం స్పందించే పరిస్థితి లేదంటే ఇదంతా తెలిసేజరుగుతోన్నట్లు స్పష్టమవుతుంది. నెలసరి ఆదాయవనరులను తెచ్చి పెట్టే షాప్‌లపై చర్యలు తీసుకోవడమంటే ఎక్సైజ్ శాఖ అధి౯కారులు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. అధికారుల వ్యవహారం  బెల్ట్ షాప్, వైన్స్ యాజమానులకు కలిసివచ్చినట్లు అయ్యింది. అధికారుల అండదండలు ఉండగా మాకేమి భయం అనే విధంగా మారింది మండల పరిస్థితి. ఇక అడిగేనాథుడు లేక ఆడిందే ఆటా పాడిందే పాటగా మారింది. అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకున్నా బెల్ట్ షాప్‌లు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఇట్టే అర్థమవుతోంది. కల్తీ నాటుసారా, కల్తీ కల్లు గ్రామంల్లో పూర్తిగా నియంత్రించబడుతుందో అప్పుడే గ్రామాల్లో ప్రశాంతత ఉండేది. మళ్ళీ గ్రామాల్లో బెల్ట్ షాప్‌లు తెరవడంతో గ్రామాల్లో కొట్లాటలు, పంచాయతీలు ప్రారంభమయ్యాయి. ఏకంగా గ్రామ బహిష్కరణలు, తదితర కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. రోజంతా కూలీ పని చేసుకొన్నా పేదలు కాస్త డబ్బులు కూడబెట్టు కొనే ప్రయత్నం చేసుకోనే సమయంలో విచ్చల విడిగా తెరిచిన బెల్ట్ షాప్‌ల కారణంగా మద్యనికి బానిసలై ఉన్న డబ్బులను ఊడగొట్టుకొంటున్నారు. దీంతో పేదలు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. ఇలా పేదలను ఆర్థికంగా దెబ్బ తీస్తోన్న మద్యం వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. పేదల పాలిట శాపంగా మారిన బెల్ట్ షాప్ లను తొలగిస్తే తప్ప వారి కుటుంబాలు బాగుపడవనేది నగ్న సత్యం.

Comments

comments