Search
Saturday 21 April 2018
  • :
  • :

చలితో జాగ్రత్త సుమీ..!

winter

* ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
* భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
* జాగ్రత్తలు పాటిస్తేనే ఉపశమనం
* అప్రమత్తతోనే వ్యాధులు దూరం

మన తెలంగాణ/మహబూబ్‌నగర్: గత కొన్ని రోజుల నుంచి చలి గాలుల తీవ్రత బాగా పెరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల ను చలి గజ గజ వణికిస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. చలి తీవ్రత కారణంగా సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, శ్వాస కోశ వ్యాధులకు తోడు మరిన్ని వ్యాధులు చుట్టుముట్టే అవకా శం ఉందని వైద్యనిపుణులు అంటున్నారు. రోజు రోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతల దృష్ణా ప్రతి ఒక్కరూ అప్రమ త్తంగా ఉంటేనే వ్యాధుల బారి న పడకుండా ఉండొచ్చ ని వైద్యులు చెబుతున్నా రు. ఆహార పు అల వాట్ల ను మా ర్చు కోవా లని వైద్యులు పేర్కొన్నారు. లేకుంటే ఈ చలిగా లుల వల్ల అనేక వ్యాధులు సోకట మే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్య లకు దారి తీస్తుందని చెబుతున్నారు. గత పది రోజుల నుంచి చలి తీవ్రత కారణంగా అనేక వ్యాధులకు గురై చాలా మంది బాధితులు ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. శీతాకాలం ముగిం పు దశలో చలి పంజా విసరడం ఆందోళనకు గురిచే స్తోంది. పగటి, రాత్రి ఉష్ఱోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 8 వరకు చలి గజ గజ వణిస్తోంది. చలి గాలుల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని ప్రజ లు జలుబు, దగ్గు, గొంతు, శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడడమే కాకుండా చర్మ సంబంధమైన ఇబ్బందులకు గురవుతున్నారు. చలి పట్ల అప్రమత్తతో ఉంటూ తగు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తగు జాగ్రత్తలు తీసుకోవాలి
ఉదయం 7 గంటల తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి. ఏదైనా అత్యవసరమై అంతకన్నా ముందే వెళ్లాలనుకుంటే విధిగా స్వెట్టర్లు, జర్కిన్లు, తలకు మంకీ క్యాపులను ధరించాలి. అదే విధం గా చిన్నపిల్లలకు, వృద్ధులకు చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ఉండాలి. రాత్రి పూట ఆరుబ యట నిద్ర పోకుండా ఉండాలి. దుప్పట్లను విధిగా ఉపయోగించుకోవాలి. రాత్రి 7 గంటల లోపే ఇంటికి తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వెచ్చని నీటితో స్నానం చేయాలి. గోరు వెచ్చని ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వేడి వేడి ఆహారాన్ని భుజించాలి. శీతల గిడ్డంగుల్లో, వ్యవసా య పనులు చేసే కూలీలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అర గంటలకు ఒకసారి గిడ్డింగి నుంచి బయటకు రావాలి. వ్యవసాయ పొలాలకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు పాటించి పనులు చేసుకోవాలి. ఉదయం పూట ప్రతి ఒక్కరు తమ శరీరంపై అరగంట పాటు సూర్యకాంతి పడేలా చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు గ్రామీణ ప్రాంతాల వారు రాత్రిపూట, తెల్లవారు జామున పనులు పెట్టుకోకూడదు. చలి మంటలు వేసుకొని చలి నుంచి ఉపశమనం పొందా లి. దుమ్ము, ధూలి బాగా ఉండే ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు పనులు నిర్వహించకూ డదు. చలి తగ్గు ముఖం పట్టాకే ఆ ప్రాంతంలో పనులకు వెళ్లాలి. వాహనాలు నడిపే వారు చలి గాలిలో ప్రయాణాలు చేయకూడదు. దుమ్ము, ధూళి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముక్కు లోకి నేరుగా చలి గాలి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి.
చలి వల్ల వచ్చే వ్యాధులివే..!
డ్రై గ్యాంగ్రీనే: బాహ్య చర్మం కింద ఉండే రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఆ పై శరీరం లోని కణజాలలకు రక్తం సరఫరా కాక అవి చనిపోతాయి. అతి చలి కారణంగా బెల్స్ పాలిసీ అనే వ్యాధి వస్తుంది. ముఖ్యంగా వాహనాలు నడిపే వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు, శరీరా నికి స్వెట్టర్లు, తలకు మంకీ క్యాప్ ధరించాలి. అలా లేకుంటే బెల్స్ పాలిసీ వ్యాధికి గురవుతారు. దీని వల్ల మూతి వంకరపోవటం, నోటి నుంచి నురుగు రావటం వంటివి జరుగుతాయి. ప్రధా నంగా పొగరాయుళ్లు, మద్యం ప్రియుళ్లు చలి బాగా వీస్తున్న సమయంలో బయటకు రాకూడదు. ఆ సమయంలో వారు బయటకు వస్తే చేతులు, కాళ్లకు పుండ్లు పుడతాయి. ఉబ్బశ వ్యాధిగ్రస్తులకు వాయుగోళాలు మూసుకుపోయి ప్రాణప్రాయం సంభవించే అవకాశం ఉంది. మధుమేహగ్రస్తులు చలి ప్రభావానికి గురైతే వారికి శరీరం అంతా మొద్దుబారిపోవడం, తిమ్మెర్లు ఎక్కడం, నొప్పులు సైతం వస్తా యి. చిన్నారులకు, వృద్ధులకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి చర్మ సమస్యలు వస్తాయి. కావున చలి పట్ల నిర్లక్షంగా ఉండకుండా తగు జాగ్రత్తలను పాటించాలి. శరీరంలో మార్పుల వచ్చినా, ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
వీటికి దూరంగా ఉండాలి..!
మధుమేహం, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారు వృద్ధులు ఉదయం పూట నడకకు వెళ్లకూడదు. వీరు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య నడిస్తే మేలు. ఆస్తమాతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారు ఉదయం 8 గంటల లోపు బయటకు రాకూడదు. అదే విధంగా సాయంత్రం 6 గంటల లోపే ఇంటికి చేరాలి. ఈ సీజన్‌లో తరచూ తల స్నానం చేయకూడదు. ప్రస్తుతం చలి తీవ్రత దృష్ణా శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దల దాకా ఏ ఒక్కరూ వాటిని తీసుకోకూడదు. ఫ్రిజ్‌లో నీళ్లు నిల్వ చేసి తాగకూడదు. శరీరంపై ఎక్కువగా శ్రద్ధ చూపాలి. చేతులు, కాళ్లు పగలకుండా క్రీములను విధిగా వాడాలి. పెదవులకు సైతం లిప్‌బామ్‌ను ఉపయోగించాలి.
ఆహారం విషయంలో అప్రమత్తం..!
తాజా ఆహార పదార్థాలు సాధ్యమైనంత వరకు అవి వేడిగా ఉండేలా చూసుకో వాలి. మాంసకృతులు ఉండే ఆహారాన్ని బాగా తీసుకోవాలి.ముఖ్యంగా పప్పు దిను సులు, పాలు, కోడి గుడ్లు తరచుగా తీసుకోవాలి. పిండి పదారాలు అధికంగా ఉండే చిరు ధాన్యాలు వంటివి బాగా తినాలి.జలుబు వంటివి రాకుండా ఉండటానికి దాల్చిన చెక్క, మెంతులు రోజూ ఒకటి లేదా రెండు టీస్పూన్‌లు తీసుకోవాలి. శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యేందుకు బాదం, పిస్తా వంటివి తీసుకోవాలి.వాటిని తీసుకోవటం వల్ల శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంపొంది స్తాయి. రోగాలను తట్టుకునే శక్తి ఉండాలంటే శీతాకాలంలో తప్పనిసరిగా క్యాలీఫ్లవర్ తీసుకోవాలి.

Comments

comments