Search
Sunday 21 January 2018
  • :
  • :

బ్యాంకింగ్ యాప్స్‌తో జాగ్రత్త..

 ట్రోజన్ మాల్‌వేర్‌తో 232 బ్యాంక్ యాప్‌లకు ముప్పు
 క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్ హెచ్చరిక

bankingముంబై: స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత అంతా చేతిలోనే పనులు చకచకా అవుతున్నాయి. డిజిటల్ టెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా.. హ్యాకర్ల బారిన పడితే నష్టం అంతా ఇంతా కాదనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో ‘యాప్’ల ట్రెండ్ నడుస్తోంది. ఏం కావాలన్నా యాప్‌లోకి వెళితే చాలు పనులు పూర్తయ్యే రోజులు వచ్చాయి. లావాదేవీలను నిర్వహించేందుకు ప్రతి బ్యాంకూ యాప్‌ను నిర్వహిస్తోంది. ‘గూగుల్ ప్లే’లోకి వెళితే బ్యాంకింగ్ యాప్‌లు బోలెడు కనిపిస్తాయి. వాటిలో అసలు ఏదో నకిలీ ఏదో గుర్తించడం కష్టం.. ఇప్పుడు హ్యాకర్లకు వరంగా మారిం ది. అసలు యాప్‌ను వదిలేసి అసలులా ఉండే నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారా.. ఇక అంతే సంగతులు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
232 బ్యాంకింగ్ యాప్స్ టార్గెట్
బ్యాంకింగ్ యాప్స్ లక్షంగా చేసుకుని మాల్‌వేర్‌లు వచ్చాయని ఇంటర్నెట్, సైబర్‌సెక్యూరిటీ సంస్థ ‘క్విక్ హీల్’ సెక్యూరిటీ ల్యాబ్ హెచ్చరిస్తోంది. దేశంలోని 232 బ్యాంకింగ్ యాప్స్‌ను ’ఆండ్రాయిడ్.బ్యాంకర్.ఎ9480’ అనే ట్రోజన్ మాల్‌వేర్ టార్గెట్ చేసిందని నివేదికలు వెల్లడించాయి. వీటిలో ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, ఐడిబిఐ, యాక్సిస్ వంటి దేశీయ ప్రధాన బ్యాంక్‌ల యాప్‌లు ఉన్నాయి. యూజర్ల లాగిన్ డేటా, ఎస్‌ఎంఎస్, కాంటాక్ట్ లిస్టులను హానికర సర్వర్‌లో అప్‌లోడ్ చేసినట్టు పేర్కొన్నాయి. అదనంగా బ్యాంకింగ్ యాప్స్‌తో పాటు, వినియోగదారులు ఫోన్లలో వాడే క్రిప్టోకరెన్సీ యాప్స్‌ను కూడా ఈ ట్రోజన్ లక్షంగా చేసిందని తెలిపింది.
హ్యాకర్లు డేటాను దొంగిలిస్తారు..
థర్డ్‌పార్టీ స్టోర్ల ఫేక్ ఫ్లాష్ ప్లేయర్ ద్వారా ఆండ్రాయిడ్.బ్యాంకర్.ఎ9480 మాల్‌వేర్ విజృంభిస్తుందని క్విక్ హీల్ నివేదిక పేర్కొంది. సైబర్‌క్రిమినల్స్ ఫ్లాష్ ప్లేయర్ యాప్‌తో గాలం వేస్తారు. ఒక్కసారి వినియోగదారులు ఈ హానికర అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేస్తే, కనిపించని ఐకాన్ యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేస్తుంది. అది టార్గెట్ చేసిన 232 బ్యాంకింగ్ యాప్స్‌కు సంబంధించి ఏ ఒక్క యాప్‌ను యూజర్లు చెక్ చేసుకున్నా, ఆ హానికర యాప్ బ్యాంక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ ఉంటుంది. యూజర్ల డేటాను దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కీలక డేటాను దొంగలిస్తుందని క్విక్ హీల్ నివేదిక వెల్లడించింది.
ఎలాంటి జాగ్రత్తలు పాటింటాలి..
థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి లేదా ఎస్‌ఎం, ఇ మెయిల్‌లలో ఇచ్చే లింక్‌ల నుంచి ఎలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని బ్యాంకర్లు, ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఇది వారి ఆధారాలను సురక్షితంగా ఉంచుతుందని అంటున్నారు. ఒటిఎ సెక్యూరిటీ అప్‌డేట్ వెంటనే ప్రభావిత బ్యాంకింగ్ యాప్స్‌కు సమాచారం పంపుతుంది. ఒఎస్, మొబైల్ సెక్యూరిటీ యాప్లను అప్‌టుడేట్‌గా ఉంచుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు.

లక్ష్యంగా చేసుకున్న యాప్స్ జాబితా

ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్‌వేర్ లక్షంగా చేసుకున్న దేశీయ బ్యాంకింగ్ యాప్స్ జాబితాను ఈ సందర్భంగా క్విక్ హీల్ విడుదల చేసింది. ఈ బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్న కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు.
* యాక్సిస్ మొబైల్
* హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్
* ఎస్‌బిఐ ఎనీవేర్ పర్సనల్
* హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ లైట్
* ఐసిఐసిఐ బ్యాంకు ఐమొబైల్
* ఐడిబిఐ బ్యాంకు గో మొబైల్+
* ఐడిబిఐ బ్యాంకు లిమిటెడ్ అభయ్
* ఐడిబిఐ బ్యాంకు గో మొబైల్
* ఐడిబిఐ బ్యాంక్ ఎంపాస్‌బుక్
* బరోడా ఎంపాస్‌బుక్
* యూనియన్ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్
* యూనియన్ బ్యాంకు కమర్షియల్ క్లయింట్స్

Comments

comments