Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

పతంగుల పోటీల్లో జాగ్రత్తలు అవసరం

kite

మన తెలంగాణ/సిటీబ్యూరో : సంక్రాంతి పండుగ అంటే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చేది ముగ్గు ల పోటీలతో పాటు గాలి పటాల పోటీలు కూడా గుర్తుకొస్తాయి. ఈ సందర్భంగా చిన్నా, పెద్ద అనే తేడా లే కుండా అందరూ ఉత్సాహంగా పాల్గొనే పోటీలు గాలిపటాల పోటీలు మాత్రమే అని చెప్పవచ్చు. అయితే గాలిపటాల పోటీల సందర్భంగా కొందరు ప్రమాదాల బారిన పడుతున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నా యి. ఈ ఉత్సవాలను అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ అధికారులు సూచిస్తున్నా రు. విద్యుత్ స్తంభాలు, తీగలు వంటి ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు లేని ప్రాంతంలో పతంగులు ఎగురవేయాలని, అదే విధంగా విద్యుత్ స్తంభాలు తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గాలి పటాలను ఎగుర వేయకూడదని వారు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ వైర్ల మీద పడిన గాలిపటాలను తీసుకునే ప్రయత్నం చేయవద్దని వాటి ద్వారా విద్యుత్ షాక్‌కు గురయ్యే అవకాశం ఉందన్నారు. పతంగులను ఎగురవేసేందుకు మెటాలిక్ దారాలను వినియోగించవద్దని వాటి ద్వారా విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

భవనాల మీద నుంచి గాని, సగం నిర్మించిన గోడల మీద నుంచి పతంగులును ఎగురవేసి ప్రయ త్నం చేయవద్దని, వీటి ద్వారా విద్యుత్ తీగలు శరీరానికి తాకి విద్యుత్ ప్రవహించే అవకాశం ఉందన్నారు. పతంగులను ఎగురు వేస్తున్న సమయంలో సమీప ప్రాంతాల్లో హైటెన్‌షన్ తీగలు (హెచ్‌టి) ఏమైనా ఉన్నాయా లేదా అనే అంశాలను గమనించాలన్నారు. చిన్నారులు ఈ ఉత్సవాల్లో పాల్గొనేటప్పుడు పెద్దలు తప్పకుండా వారికి సమీపంలోని ఉండి జాగ్రత్తలు చెప్పాలని వారు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదాలు సంభవించి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పడు వెంటనే 1912కు డయల్ చేయడం కాని లేదా సమీపంలో ఉన్న విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించడం కాని చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు గాలి పటాలు మైదానా ప్రాంతాల్లో ఎగుర వేయాలని, తద్వా రా విద్యుత్ తీగలకు, దూరంగా ఉండి పండుగ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు.

Comments

comments