Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

భోగ భాగ్యాల భోగి

Bhogi-image

నేడు భోగి పర్వదినందక్షిణాయనానికి చివరి రోజు భోగిగ్రామాల్లో భోగిమంటల కార్యక్రమాలుఇళ్లలో భోగి పండ్ల వేడుకలు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్: మనం సహజంగా పండగలన్నీచంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. కాని ఈ సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకునినిర్ణయం చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ అనేది మూడురోజుల పర్వదినం. తిథితో సంబంధం లేని పండగ. ఈ మూడు రోజులపండుగలో మొదటి రోజు భోగి పండుగ, మరక సంక్రాంతికి ముందురోజు వచ్చేది భోగి. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు ఈరోజు.

భోగి విశిష్టత: భోగి అంటే భోగ భాగ్యాలను అందించే రోజు అని అర్థంఎలాంగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇండ్లకు వచ్చే కాల సమయం.ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానాంతరంప్రతి ఇంటి ఎదుట భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతనతానికి స్వాగం పలికి భోగి మంటలలో పాత పనికిరాని వస్తువులను వేసిపీడలను, అరిష్టాలను తొలగించాలని భగవంతుడిని కోరుకుంటారు.తెల్లవారక ముందేభోగి మంటలతోమొదలుకొని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభంఅవుతుంది. మనలోఉన్న బద్ధకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్నచెడు తలంపులను ఈభోగి మంటలలో వేసిఈ రోజు నుంచి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొనిఉన్న జీవితాన్నిప్రారంభిస్తున్నాముఅని ఆత్మారామునికి మాట ఇచ్చి భగవత్ సన్నిధిలో నిశ్చయ సంకల్పంచేసుకోవడం జరుగుతుంది.

పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు: భోగి పర్వదినం రోజునఐదు సంవత్సరాలలోపు చిన్న పిల్లలకు భోగి పండ్లను పోయడం వలనవారికి ఉన్న బాలారిష్టాలు, ఇతర దోషాలు తొలగిపోతాయి. పిల్లలకుభోగి పండ్లను సాయంకాల సమయంలో పోస్తారు. ఈ భోగి పండ్లలోరేగుపండ్లు, జీడిపండ్లు, కొన్ని చిల్లర నాణేములను, బియ్యం పిండితోచేసి నువ్వుల నూనేలో వేయించిన చిన్న చిన్న వేపగింజల ఆకారంలోతాల్కలు, చెరుకుగడ ముక్కలను ఈ ఐదింటింని ఒక చోట కలిపి ఇంట్లోఉన్న పిల్లల్లో ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన వారికి కొత్త బట్టలువేసి కూర్చోవడానికి చాప, దుప్పటి లాంటిది వేసి తూర్పు వైపు ముఖంఉండేలాగ కూర్చోబెట్టి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఇరుగు పొరుగుపిల్లలను పిలిచి భోగి పండ్లను రెండు చేతులతో పిల్లల తలపై నుంచికిందకు జారిపడే లాగా పోయాలి. ఆ కింద పడిన భోగి పండ్లను పిల్లలసరదా పడుతూ, పోటీ పడుతూ ఏరుకుని తింటారు.

ఈ సంక్రాంతిభోగి రోజు కొన్ని ప్రాంతాల్లో ముత్తైదువులు కొత్త గాజులు వేసుకుంటారు. గాజులు తొడిగిన గాజుల వ్యాపారికి వారి పంట పొలాలలోపండిన కొత్త వడ్లను, ధ్యానమును ఇచ్చి సంతృప్తిగా సాగనంపడం ఆనవాయితీగా వస్తుంది. ఇంటికి వచ్చి కొత్త అళ్లులు, కూతుర్లతో సరదాగాఆనందంగా పండుగను జరుపుకుంటారు. ఈరోజును కుటుంబంలోఎంతగానో ఆనంద ఆప్యాయతల మధ్యఅనుభూతులు పొంతుతారు. పేద,గొప్ప అనే తారతమ్యం లేకుండాకుటుంబ సభ్యులు, ఆత్మీయు లతోఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మికచింతన కలిగిన వారు ధనుర్మాసంలోచివరిరోజుకావడం చేత దినమంతాదైవచింతనతో గడుపుతారు. విష్ణుచిత్తునికుమార్తె ఆండాళ్ ఈ ధను ర్మాసంలోనేకాత్యాయని వత్రంచేసిసాక్షాత్తుభగవంతున్నిమెప్పించిందని పురాణగాథ. భగవంతున్ని మనస్సు పెట్టిఎవరైతే ధ్యానిస్తారో వారి పట్ల దేవుడుకోరిన కొర్కేలను తప్పక తీరుస్తా డనిపురాణ, ఇతిహాసాలలో పేర్కొనబడింది.

సప్తవర్ణ శోభితాలు రంగవల్లులు: సంక్రాంతి అంటేనే మహిళలకుముగ్గుల పండుగ. పల్లెల్లో, పట్టణాల్లో వేకువ జామునే మహిళలు ముగ్గులతో వేయ డంతో నిమగ్నమవుతారు. భోగి రోజు ఉదయాన్నే ఇంటివాకిళ్లలో మహిళలు, యువతులు రంగు రంగుల ముగ్గులను వేయడంకోసం కుస్తీ పడుతుంటారు. అందమైన రంగు వల్లులను తీర్చిదిద్దడంలోమహిళలు పోటీ పడుతుంటారు. పండుగ సందర్భంగా పల్లెల్లో, పట్టణాల్లో ఇళ్ల ముంగిట్లో సప్తవర్ణ శోభితాలుగా రంగవల్లులు దర్శనమిస్తాయి.ముగ్గులు వేసిన తర్వాత గొబ్బెమ్మలను అలంకరిస్తారు. మహిళలువేసిన ముగ్గులు చూడముచ్చైన రంగులతో అందరినీ ఆకట్టుకుంటాయి.గ్రామాల్లోగంగిరెద్దుల విన్యాసాలు సంబురపరిచే విధంగా సాగుతాయి.

Comments

comments