Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అబ్బాయిని ఎత్తుకెళ్లి.. పెళ్లి..!(వీడియో)

Bihar-Engineer-Forced-to-Ma

పాట్నా: బీహార్‌లో ఓ యువకుడికి సంబంధించిన పెళ్లి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాకు పెళ్లి వద్దని సదరు యువకుడు ఏడ్చిన పెళ్లి కూతురు తరుపువాళ్లు వినిపించుకోకుండా.. పైగా తుపాకీతో బెదిరించి బలవంతంగా వివాహం జరిపించడం మనం ఈ వీడియోలో గమనించొచ్చు. ఏదో అబ్బాయి తప్పు చేసి ఉంటాడు.. అందుకే అమ్మాయి తరుపువాళ్లు ఇలా బెదిరించి, బలవంతంగా పెళ్లి చేసి ఉంటారనుకుంటే పొరపాటే. అసలేం జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే… బీహార్ రాజధాని పాట్న పరిధిలోని బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న వినోద్ కుమార్ అనే యువకుడు ఇటీవల ఓ స్నేహితుడి పెళ్లికని ఊరికి వెళ్లాడు. ఆ పెళ్లిలో ఓ వ్యక్తి వినోద్‌కు స్నేహితుడయ్యాడు.

ఈ పెళ్లి అనంతరం వినోద్ యథావిధిగా పాట్నాకు వెళ్లి తన విధుల్లో నిమగ్నమయ్యాడు. అయితే ఓ రోజు పెళ్లిలో పరిచయమైన ఆ వ్యక్తి వినోద్‌ను తన ఇంటికి రావాలని తీసుకెళ్లాడు. ఆ తరువాత తన చెల్లిని పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించాడు. కానీ వినోద్ దానికి ససేమీరా అన్నాడు. దాంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులంతా కలిసి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసి వినోద్‌ను పెళ్లిలో కుర్చొబెట్టారు. ఆ సమయంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తనను వదిలేయాలని వినోద్ ప్రాధేయపడిన వినలేదు. పైగా తుపాకీ గురిపెట్టి అమ్మాయి మెడలో తాళి కట్టించడంతో పాటు నుదటన బొట్టు కూడా పెట్టించేశారు. ఈ తతాంగం అనంతరం వినోద్ తన ఇంటికి వచ్చి జరిగిన విషయం సోదరుడికి చెప్పాడు. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Bihar Engineer Kidnapped/ Forced to Marry at Gunpoint.

Comments

comments