Search
Saturday 21 April 2018
  • :
  • :

రక్తమోడిన రహదారి

road

* వేర్వేరు ఘటనలో ఇద్దరు మృతి పలువురికి గాయాలు
మన తెలంగాణ/భూత్పూర్ : నూతన సంవత్సర వేడుకలను ఆప్యాయత, అనురాగాతో జరుపుకోవాలనే ఆతృతతో దేవుని సన్నిధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సిద్ధిపేట నుంచి మంత్రాలయం వెళ్లుతున్న ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకోగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకుని తిరిగి ఉంటికి చేరుకుంటున్న సమయంలో మరో వ్యక్తి మృతి చెందిన సంఘటన భూత్పూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన కొత్తకాపు మహేష్‌రెడ్డి, ఖిల్లాఘనపూర్‌లోని ప్రభుత్వ వైద్య శాలలో కాంట్రాక్టు డాక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఆదివారం రాత్రి జిల్లా కేంద్రం సమీపంలోని మయూరి హిల్స్ నర్సరీ సమీపంలో మిత్రులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి గుండా భూత్పూర్ మీదుగా మహబూబ్‌నగర్ వెళ్లేందుకు భూత్పూర్‌లోని మునిరంగ స్వామి ఆలయం దగ్గర యూ టర్న్ తీసుకుంటుండగా మహేశ్వర్‌రెడ్డి నడుపుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సూచిక బోర్డును డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలా ఉంటే సిద్ధి పేటకు చెందిన ఓ కుటుంబం మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో వేడుకలు జరుపుకునేందుకు వెళ్తుండగా ఆదివారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై శేరుపల్లి సమీపంలో వారు ప్రయాణీస్తున్న బులెరో వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టడంతో విజయలక్ష్మీ(25) అక్కడికక్కడే మృతి చెందింది. బూలేరో వాహనంలోనే ఉన్న రాజమణి, శ్రీధర్, శివకుమార్, కవిత, సాయికుమార్‌లకు గాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. నూతన సంవత్సరంలో రోజే ఇలా కావడంతో ప్రజలు తమ భాధను వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

Comments

comments