Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

 గ్రేటర్ నోయిడాలో బాక్సర్ హత్య

Boxer

ఢిల్లీ : గ్రేటర్ నోయిడాలో జితేంద్ర మాన్ అనే బాక్సర్ హత్యకు గురయ్యాడు. దుండగులు ఆయన్ను తుపాకీతో కాల్చి చంపారు. నేషనల్ లెవల్ మాజీ బాక్సర్ అయిన జితేంద్ర తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. గ్రేటర్ నోయిడాలో ఆయన జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నారు. హరియాణా రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్‌లో ఆయన తను పేరును రిజిస్ట్రర్ చేసుకున్నారు. అతడు ఉండే అపార్ట్‌మెంట్‌లో సిసిటివి కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించలేకపోతున్నారు. జితేంద్ర మొబైల్ కాల్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. జితేంద్ర శరీరంపై రెండు బుల్లెట్లు తగిలిన గాయాలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 Boxer  Jitendra Man killed in Greater Noida

Comments

comments