Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

వరుస లాభాలకు బ్రేక్

Sensexముంబై: వరుసగా లాభాలతో దూసుకెళ్తున్న బుల్ జోరుకు బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 10 పాయింట్లు నష్టపోయి 34,433 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 5 పాయింట్లు పడిపోయి 10,632 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్లు తొలుత సరికొత్త గరిష్టాలను అందుకున్నా.. ఆ తర్వాత డీలా పడ్డాయి. ఓ దశలో సెన్సెక్స్ 34,565 కు చేరగా, నిఫ్టీ 10,655ను క్రాస్ చేసింది. ఎన్‌ఎస్‌ఇలో ఐటీ భారీగా 2.3 శాతం పెరగ్గా, ఆ తర్వాత రియల్టీ 1.3 శాతం పుంజుకుంది. పిఎస్‌యు బ్యాంక్స్ 1.4 శాతం పతనమవగా, ఆటో 0.7 శాతం బలహీనపడింది. నిఫ్టీ దిగ్గజాలలో టిసిఎస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, హెచ్‌పిసిఎల్, ఇన్ఫోసిస్ పెరిగాయి. మరోపక్క యుపిఎల్, ఐషర్, ఎన్‌ఇపిసి, డాక్టర్ రెడ్డీస్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ, హిందాల్కో 1.6-1 శాతం మధ్య క్షీణించాయి.
బిఎస్‌ఇలో ట్రేడైన మొత్తం షేర్లలో 1607 నష్టపోగా, 1319 షేర్లు లాభపడ్డాయి. నగదు విభాగంలో మంగళవారం ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) దాదాపు రూ. 304 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అలాగే దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 523 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

Comments

comments