Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

చదువుల వ్యాపారం

baby

*ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు దండుకోవడమే లక్షం
*ఫీజుల పేరిట విద్యార్థులను బయట నిలబెట్టి మనోవేదనకు గురి చేస్తున్న వైనం
*నాణ్యమైన విద్య అంటూ ప్రైవేట్ పాఠశాలలకు బలి పశువులు అవుతున్న మధ్య తరగతి కుటుంబాలు
*జర్నలిస్టుల పిల్లల ఉచిత విద్యపై కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

రోజు రోజుకు విద్య వ్యాపారంలా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఓపక్క ప్రైవేటు పాఠశాలలు,కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడుతున్నప్పటికీ ఆ మేరకు ఫలితాలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ కేజీ టూ పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా విద్యను అందిస్తుందని చెబుతున్నా పూర్తిసాయిలో ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు లక్షలు వెచ్చించి విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం పాఠశాలల్లో మాత్రం మెరుగైన వసతులు నాణ్యమైన విద్యాబోధన, విద్యార్థుల విద్యాసామర్థాలపై పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తూ చదువును కొంటున్నారు. దీని ఫలితంగా విద్యావ్యవస్థ పూర్తిగా వ్యాపారమయంగా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తలలు పట్టుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజు రోజుకు విద్య వ్యాపారంలా మారు తోంది. తెలంగాణ ప్రభుత్వం ఓ పక్క ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు ల నియంత్రణకు చర్యలు చేపడుతున్నప్పటికి ఆ మేరకు ఫలితాలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్ కేజీ టూ పీజీ వరకు ఇంగీష్ల్ మీడియం విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా విద్యను అంది స్తుందని చెబుతున్నా పూర్తిసాయిలో ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా ఎల్‌కేజీ నుండి పిజి వరకు లక్షలు వెచ్చించి విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే ప్రభుత్వం పాఠశాలలో మెరుగైన వసతులు నాణ్యమైన విద్యాభోదన, విద్యార్థుల విద్యాసామర్థాలపై పర్యవేక్షణ చేసే పరిస్థితి లేకపపోవడంతో విద్యార్థుల తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పి స్తూ చదువును కొంటున్నారు. ఫలితంగా విద్యావ్యవస్థ పూర్తిగా వ్యాపార మయం గా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తలలు పట్టుకున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో రెసిడెన్షియల్ ,కేజీచీవీ, ఆదర్శ పాఠశాలలు, జవహార్ నవోదయ, కేంద్రీయ విద్యాల యాలలో, ప్రైవేటు పాఠశాలలలో కలిపి 1277 ఉన్నాయి. ఇందులో వందల సంఖ్యలో ప్రైవేటు కు సం బంధించిన పాఠశాలలు ఉన్నట్లు తెలిసిందే. అదే స్థాయిలో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ స్థాయిలో కూడ విద్యను లక్షల రూపా యలు పోసి చదువుకుంటున్నారు. ఆధునిక సమాజంలో సంపన్న వర్గాలతో పాటు పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కూడ తమ పిల్లలను ఉన్నత చదువులను చదివించి ఉన్నత స్థాయిలో నిలబెట్టుకోవడం కోసం కేజీ నుండి పీజీ వర కు లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు విద్యను కొంటూ చదివించుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.

గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎందరో నేడు జాతీ య స్థాయిలో,రాష్ట్రస్థాయిలో ఉన్నత మైన విలువలుగల ఉద్యోగాలు చేస్తున్నా వారు కళ్లముందే ఉండి తమ జీవిత వ్యత్యా సాలను విడమర్చి చెబుతున్నా తల్లి దండ్రులు ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. ప్రైవేటు విద్యాలయాల్లో లక్షల రూపాయలు వెచ్చించి చదివిస్తేనే తమ పిల్లలు బాగుపడి ఉన్నత చదువులు చదివి గొప్పవారు అవుతారన్న భావనతో చదువును కొనుక్కోవాల్సిన సాంప్రదాయం రోజు రోజుకు పెరుగుతోంది. కూలీ చేసుకునే వారు కూడ తమ పిల్లలు పెద్ద స్కూళ్లలో ఇంగ్లీష్ మిడీయంలో చదివించేందుకు అనేక తంటాలు పడుతూ చదివిపిస్తున్నారే తప్పా ప్రభుత్వం ఓవైపు విద్యార్థి చట్టాన్ని అమలు చేస్తూ ఉచిత, నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక భోజనాన్ని అందించే క్రమంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నప్పటికి సంపన్న వర్గాలకు పోటీపడి ప్రభుత్వ విద్యకు దూరమై చివరికి అప్పుల పాటు అయ్యే పరిస్థితి కొనితెచ్చుకుంటున్నారు. దీనికి తోడు సాంకేతిక విద్యాభ్యాసం చేస్తున్నా సర్కారు బడులపై సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించలేకపోయింది. ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమం దిశగా చర్యలు తీసుకుంటున్నా వారి పిల్లలకు పూర్తి స్థాయిలో హాస్టల్ సౌకర్యం ద్వారా విద్యను అందిస్తున్నా కూడ అతి కారణంతో ప్రైవేటు బడులు ,కళశాలలనే ఆశ్రయిస్తూ ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. దీనిని అదునుగా చేసుకున్న విద్యా సంస్థల యాజమా న్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఫీజులు దండుకుంటున్నారు. ప్రతి ఏడాది జిల్లాలో ఎల్‌కేజీ నుండి పీజీ వరకు ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. యూనిట్, త్రైమాసిక, అర్ధవార్శిక, వార్షిక పరీక్షల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఆ సమయంలో ఫీజులు కట్టందే విద్యార్థులను పరీక్షలు రాయినివ్వమని విద్యార్థులకు యాజమాన్యాలు హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు మానసిక ఇబ్బందులకు గురై విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించలేక పోతున్నారనే విమర్శ నెలకొంది. ఇప్పటికైనా పేద ,మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్నా అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంటుం ది.
ప్రభుత్వ పాఠశాలలను వినిగియోగించుకోలేకపోతున్నారు
జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అంతంత మాత్రమే. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన గురుకుల, మైనారిటీ, కస్తూ ర్బా, మోడల్ పాఠశాలలో విద్యార్థులు విద్యనభ్యసించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా సుమారు 500 పాఠశాలలు ప్రారంభించారు. ఇట్టి పాఠశాలలోనే తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడి వసతులు మె రుగ్గా ఉండడంతో ప్రభుత్వ పాఠశాల వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు మొగ్గు చూపలేకపోతున్నారు.
అందని ద్రాక్షలా జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య
ప్రభుత్వానికి, ప్రజలకు వారిధిగా ఉంటూ నిత్యం సేవలందిస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ పలుమార్లు శాఖాధికారులతో, జర్నలిస్టులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనిపై సమగ్ర నివేదికతో ఖచ్చితంగా జర్నలిస్టు పిల్లలకి ఉచిత విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. జర్నలిస్టు సంఘాలతో అధికారిణి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశాల్లోనే పిల్లల పూర్తి వివరాలు సేకరించారు. తదుపరి యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రైవేటు యాజమాన్యాలు గతంలో మాదిరిగానే 50 శాతం మాత్రమే ఫీజులో రాయితీ కల్పిస్తామని జిల్లా విద్యాశాఖాధికారికి తేల్చి చెప్పినట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఇందుకు ఎటువంటి సమాచారాన్ని మరల శాఖాధికారులు అందించకపోవడంతో యాజమాన్యాలు జర్నలిస్టులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిర్మోహమాటంగా ఫీజు చెల్లించని విద్యార్థులను బయట నిలబెట్టడం, పాఠశాలకు రావద్దని బెదిరించడం జరుగుతున్నట్లు పిల్లలు చెప్తున్నారు. దీనితో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను జారీ చేయడంలో విద్యాశాఖ విఫలమైనట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పటికైన విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు సరైన అవగాహన కల్పించి ఉచిత విద్య అందించే విధంగా చర్యలు తీసు కుంటే బాగుంటుందని కోరుతున్నారు. దీనిపై డిఈఓను వివరణ కోసం చరవాణిలో ప్రయత్నించగా స్పందించలేదు.

Comments

comments