Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

జనవరి చివరినాటికి మిషన్ భగీరథ పనులు పూర్తి

speak2మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతి నిథి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథపనులను జనవరి చివరి నాటికి పూర్తిచేసి ట్రయల్న్‌క్రు సిద్ధం చేయాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారు ఎ దుళ్ళగుట్ట వద్ద జరుగుతున్న పాలేరు వాటర్‌గ్రిడ్ హెడ్‌వర్క్ పనులను ఆయా జిల్లా పరిపాలన అధికారులు, పర్యవేక్షక ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌తో కలిసి మిషన్ భగీరధ పనులను సెగ్మెంట్‌లవారీగా బల్క్ వాటర్‌సప్లయి, రా వాటర్ పంప్ సెట్లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్. సంప్ పంప్‌హౌస్, జిఎల్ బిఆర్‌లు, గ్రావిటి పైప్‌లైన్‌పై ఉమ్మ డి వరంగల్ జిల్లా స్థాయి మిషన్ భగీరధ పనులను సమీక్షించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలే రు, ఎల్‌యండి పరకాల, మంథిని, బూపాల్‌పల్లి, గోదావరి మంగపేట, జనగాం, యాదాద్రి సెగ్మెంట్‌ల వాటర్ ట్రీట్‌మెంట్ ఓహెచ్‌ఎస్ మెదటి దశ పనులను వివరాలను అధికారులను, వర్క్ ఏజెన్సీలను అడిగి తెలిలుసుకున్నారు.

పాలేరు సిగెఉ్మం ట్ క్రింద వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి, ఖమ్మం జిల్లాలోని తిరుమలాయ పాలెం కలిసి మొత్తం 21కొత్తగా మండలాలను కలుపుకుని మండలాల్లోని 1706 శివారు గ్రామాలు, రెండు పట్టణ ప్రాంతాలకు నీరు ఇవ్వాల్సి ఉండగా జనవరి 15నాటికి 614 ఆవాస ప్రాంతాలకు 20 తేదీ వరకు 396ఆవాసాలకు, 31లోగా 700ఆవాస ప్రాంతాలకు నీరు అందేలా ట్రాయల్న్ పూర్తి చేయనున్నట్లు అధికారులు చెప్పారు. పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత గ్రామాలకు ఇంట్రావిలేజ్ పైప్‌లైన్ పనులు పూర్తి చేశామని ప్యవేక్షక ఇంజనర్లు తెలిపారు. రెండు, మూడవ విడత పనులు వెంటనే పూర్తి చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ పనులు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో అతి తక్కువ కాలంలోనే రూ.21వేల కోట్లు ఖచ్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల గ్రామాలకు శుద్దిచేసిన నదీ జలాలను అందించడం జరుగుతుందని తెలిపారు. వరంగల్ జిల్లా లో దాదాపు 77శాతం గ్రామాలకు జనవరి 30 లోగా శుద్ధి నదీజలాలను గ్రామాల్లోని ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల వరకు పైప్‌లైన్ల ద్వారా చేరనున్నట్లు తెలిఆపరు. మరో 25శాతం ఫ్రిబవరి చివరినాటికి నీరు చేరేలా లకా్ష్మన్ని నిర్ధారించారు. అందుకు అణుగుణంగా అధికారులు పనులు పూర్తి చేయాలని, లేకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్కిశ స్మితాసబర్వాల్ మాట్లాడుతూ గ్యాంగ్‌మెన్‌లను అధికంగా పెంచి ఈనెల చివరిలోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని మిషన్ భగీరధ పర్యవేక్షక ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలను అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఖమ్మం జెడ్పీ చైర్మన్ కవిత, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, మదన్‌లాల్, ఆర్‌డబ్లుఎస్ చీఫ్ ఇంజనీయర్ సురేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, సిఇ విజయపాల్‌రెడ్డి, మహబూబాబాద్ జెసి దామోదర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఎస్‌ఇలు, ఇఇలు, డిఇలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments