Search
Saturday 21 April 2018
  • :
  • :

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

cong

*టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్

మనతెలంగాణ/నిజామాబాద్ సిటి: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్‌లోని ఆలూర్‌లో హరిజన రైతు సదస్సు విజయవంతమైందని పేర్కొన్నా రు. ఇది ఒక చారిత్రత్మాకంగా మారనుందన్నారు. రైతులకు రుణమాఫీ ఏకకాలంలో కాంగ్రెస్ హయాంలో చేస్తామని చెప్పడం సంతోషకరమైన విషయమని కొనియాడారు. రైతుల సమస్య లను తీర్చేది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రతి పనిని పరిపూర్ణంగా చేసి చూపుతుందన్నారు. కేసిఆర్ రైతులకు విడతలుగా రుణమాఫీ చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రానున్న కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులకు క్రిమిలేయర్ సయితం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్‌కు మార్, బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్య క్షులు మాడవేటి వినోద్‌కుమార్, బిసి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురే ష్‌గౌడ్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్య క్షులు నరాల సుధాకర్, బుస్సా ఆంజనే యులు, రమణస్వామిలు పాల్గొన్నారు.

Comments

comments