Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

క్యాన్సర్‌ను ముందే గుర్తించవచ్చు

image

క్యాన్సర్ కణాలను ముందుగానే గుర్తించే పద్ధతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ట్యూమర్లను గుర్తించే నూతన విధానాన్ని భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాంతిని వెలువరించే అతి సూక్ష్మ కణాలతో క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే కనిపెట్టవచ్చని అంటున్నారు. ఎంఆర్‌ఐ స్కానింగ్, ఇతర క్యాన్సర్ గుర్తింపు పరీక్షల కన్నా ఈ విధానం సమర్ధవంతంగా పనిచేస్తుందం టున్నారు. మైక్రోస్కోపిక్ ఆప్టికల్ డివైజ్‌లుగా పిలిచే అతిసూక్ష్మ కణాలను ఇంజక్షన్ ద్వారా శరీరంలోకి పంపుతారు. రక్తనాళాల్లో పరారుణ కాంతిని వెలువరిస్తూ దేహమంతటా సంచరిస్తాయి. శరీరంలోని ట్యూమర్లను నిముషాల్లో గుర్తిస్తాయి. నానో కణాలు రక్తంలో కలిసి దేహంలో ప్రసరించడంతో సులువుగా ట్యూమర్లను గుర్తించవచ్చని అంటున్నారు. ఎంఆర్‌ఐ స్కాన్ కన్నా తక్కువ సమయంలో నే ఇది ఫలితాన్నిస్తుందని రట్గర్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యాగణపతి తెలిపారు. మరో ఐదేళ్లలో నానో కణాల పద్ధతి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.

Comments

comments