Search
Wednesday 20 June 2018
  • :
  • :

అక్రమ విదేశీ సిగరెట్ల పట్టివేత

sigarts
హైదరాబాద్: గుంటూరు జిల్లా సమీపంలోని ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ సిగరెట్లను డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా విదేశాల నుంచి బ్లాక్ అనే రకం సిగరేట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న డిఆర్‌ఐ అధికారులు దీనిపై ఆరా తీయగా గుంటూరులోని ఓ గోదాంలో భారీగా సిగరెట్లు దాచినట్లు గుర్తించి, ఆ గోదాంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 3500 విదేశీ సిగరెట్ పెట్టెలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 60 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు.

Comments

comments