Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు

Eve-Teasing

మన తెలంగాణ/అమీర్‌పేట : సైన్యంలో శిక్షణ పొందుతున్న యువకుడు ఓ యువతిని పెళ్ళిచేసుకోమని తరచూ ఫోన్‌లో వేదిస్తున్నాడని సంజీవరెడ్డినగర్ పో లీస్ స్టేషన్‌లో బుధవారం ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ వహిదోద్దీన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన విజయ్ మో హన్ (25) సైన్యంలో శిక్షణ పొందుతున్నాడు. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ మహిళా హాస్టల్లో ఉంటున్న యువతికి దగ్గరి బందువైన ఆ యవకుడు తరచూ ఫోన్లు చే స్తూ తనను పెళ్ళి చేసుకోమని వేదింపులకు గురుచేస్తున్నాడని తెలిపారు. ఆమె బందువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Comments

comments