Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

కమీషన్లు కోసం… రూ.5 పెట్టారు: రేవంత్ రెడ్డి

kcr-vs-Revanth-reddy

హైదరాబాద్: తన విశ్వసనీయతను టిఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…… విశ్వసనీయతపై అమరవీరుల కుటుంబాలు, ఒయు విద్యార్థులను అడుగుదామన్నారు. పోలవరం కడితే రక్తం ఏరులైపారుతుందని కెసిఆర్ అన్నారని, ఆ తరువాత తన బినామీ సంస్థకు ఆ టెండర్లు ఇప్పించుకున్నారని దుయ్యబట్టారు. మిగులు విద్యుత్ ఉందని… రూ.4.62కే ఇస్తామని ఎపి ప్రభుత్వం తెలంగాణకు లేఖ రాసిందని గుర్తు చేశారు. కానీ కెసిఆర్ మాత్రం కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థల నుంచి రూ.5 కొంటున్నారని మండిపడ్డారు. తాను చెప్పినవి ఆధారాలతో నిరూపిస్తానని సవాలు విసిరారు. విద్యుత్ లో జరిగిన అవినీతిపై సిబిఐ లేదా సెంట్రల్ విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Comments

comments