Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

యువకుడిపై చిరుత దాడి…!!

Leopard-attack

అదిలాబాద్ నిర్మల్ : నిర్మల్‌ జిల్లా  పెంబి మండలం అక్టోనిమాడ గ్రామంలో ఆదివారం  తెల్లవారుజామునా  ఓ యువకుడిపై చిరుత దాడి చేసింది.   ఆత్రం సంతోష్‌(19) అనే వ్యక్తి  పొద్దుగాల  పొలానికి  పోతుండగా చిరుతపులి  దాడిచేసింది. యువకుడు భయంతో గట్టిగా ఆరవడంతో దగ్గరలో ఉన్న రైతులు ఘటన స్థలానికి చేరుకుని చిరుతను అదరగొట్టడంతో చిరుత అక్కడి నుండి పారిపోయింది. ఈ దాడిలో యువకుడి కాళ్లు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన సంతోష్‌ను చికిత్స కోసం దావఖానకు పంపించారు. చిరుత సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments