Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

సివిల్స్-2017 మెయిన్స్ ఫలితాలు వెల్లడి

uppsc

న్యూఢిల్లీ: సివిల్స్-2017 మెయిన్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ కమిషన్(యూపిఎస్సి) తాజాగా విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను యూపిఎస్సి తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్, తదితర కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు (గ్రూప్ ఎ, గ్రూప్ బి) గతేడాది అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలను యూపిఎస్సి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత పత్రాలతో ఫిబ్రవరి 19న ఇంటర్వూలకు హాజరు కావాల్సి ఉంటుందని యూపిఎస్పి తెలిపింది.

Comments

comments