Search
Tuesday 19 June 2018
  • :
  • :

ప్రశాంతంగా ముగిసిన ఉపఎన్నిక పోలింగ్

voterమన తెలంగాణ/ఎన్‌జిఒస్ కాలనీ: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 44వ డివిజన్‌లో మంగళవారం జరిగిన ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పోటీలో ఉన్న అనిశెట్టి సరిత, కొలను సంతోష్‌రెడ్డి, ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు భారీగా ఓటింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 44వ డివిజన్‌లో మొత్తం ఓటర్లు 9641 మంది కాగా ఇందులో పురుషులు 4921, మహిళలు 4720 ఉన్నారు. ఉదయం 9 గంటలకు 500 మంది పురుషులు, 323 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 గంటలకు పురుషులు 1169, మహిళలు 961 ఓటు హక్కు వినియోగించుకోగా 22.1 శాతం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం వరకు మరింత పుంజుకుని 1 గంటల ప్రాంతంలో పురుషులు 1742 మంది, మహిళలు 1702 మొత్తం 35.72 శాతం ఓటు హక్కులో పాల్గొన్నారు. 3 గంటల ప్రాంతంలో 2233 మంది పురుషులు, 2222 స్త్రీలు మొత్తం  46.21 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పోలింగ్ ముగిసే సమయానికి 2639 మంది పురుషులు, 2603 మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మీద పోలింగ్ శాతం సాయం త్రం 5 గంటలకు 54.37 శాతం నమోదు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. అనంతరం అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య ఈవీ ఎం బాక్స్‌లను సీల్ చేసి మున్సిపల్ ఆఫీసుకు తరలించారు. సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సిఐ సంపత్‌రావు తన సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు.

Comments

comments