Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

వలసలకు ప్రతిభే గీటురాయి

కుటుంబ సభ్యుని స్పాన్సర్‌షిప్ పద్ధతికి స్వస్తి 

ట్రంప్ తాజా ప్రతిపాదనలు

Trump

వాషింగ్టన్: అక్రమ వలసలను అరికట్టడానికి సంస్కరణలు చేపట్టాలని అమెరికా యోచిస్తోంది. ఈ నేపథ్యం లో అధ్యక్షుడు ట్రంప్ ప్రతిభ ఆధారిత వలసల వ్యవస్థను బుధవారం నాడు ప్రతిపాదించారు. ‘అత్యంత ఉన్నతమైన ట్రాక్ రికార్డు’ ఉన్నవారినే దేశంలోకి అనుమతించే వ్యవస్థ అది. అమెరికాలోకి అత్యంత వేగంగా చట్టబద్ధమైన ప్రవేశం పొందే అవకాశం ఇస్తున్న స్పాన్సర్ షిప్ పద్ధతికి కూడా స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలో న్యాయబద్ధమైన నివాసిగా లేదా పౌరునిగా ఉన్న కుటుంబ సభ్యుడు ఒకరు స్పాన్సర్ చేసే పద్ధతి వల్ల గొలుసుకట్టు వలసలకు అవకాశం కలుగుతోందని దీనికి అంతం పలకాలని ట్రంప్ యోచిస్తున్నారు. అమెరికాకు మొత్తం వలసల సంఖ్యను కుదించడానికి ప్రతిభ ఆధారిత పద్ధతిని ఆయన సూచిస్తున్నారు. కెనడా, ఆస్ట్రేలియాల్లో ఉన్నట్టుగా ప్రతిభ ఆధారిత వలసల వ్యవస్థను తాను ఇష్టపడతానని ట్రంప్ చెప్పారు. సంబంధిత బిల్లులో ‘ప్రతిభ’ అనే పదం చేర్చాలని ఆయన సూచించా రు. వైట్ హౌస్‌లో చట్ట సభ సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. ప్రస్తుత వలసల పద్ధతి ప్రతిభ ఆధారంగా లేదని ఆయన తప్పుబట్టారు. 21వ శతాబ్దంలో దేశం గెలుపొందాలంటే ప్రతిభ ఆధారిత వలసల వ్యవస్థ తప్పదని అన్నారు. అనేక మంది చట్ట సభ సభ్యులు ట్రంప్ సూచనకు మద్దతు పలికారు. పిల్లల వలసలు (డిఎసిఎ) వాయిదాపడి, వలసల నియంత్రణకు సరిహద్దు భద్రతను పెంచి, గొలుసుకట్టు స్పాన్సర్ షిప్ వలసలకు ముగింపు పలకాలని వైట్ హౌస్ మెజారిటీ నాయకుడు, కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ మెక్ కార్తీ సూచించారు. ప్రతిభను కూడా చేర్చండని ట్రంప్ కల్పించుకొని అన్నారు.
హెచ్1బి నిర్ణయంపై ఎన్‌ఆర్‌ఐల హర్షం
హెచ్ బి వీసాల పొడిగింపును అడ్డుకోబోమని ట్రంప్ పాలనా యంత్రాంగం చేసిన ప్రకటనకు ఇండియన్ అమెరికన్లు బుధవారం నాడు హర్షం ప్రకటించారు. ఆ వినాశకర యోచనను విరమించకపోతే దేశం నుంచి మేథావుల వలసలు పెరిగి అమెరికా వ్యాపారం దెబ్బతినేదని వారన్నారు. ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా క్రిష్ణమూర్తి మంగళవారం నాడు వలస సర్వీసుల అధికార్లు చేసిన తాజా ప్రకటనను ప్రశంసించారు. దేశీయ కార్మికుల నైపుణ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూనే హెచ్‌బి వీసాల పొడిగింపును అనుమతించాలని ఆయన సూచించారు. అలాకాకుండా వారిని స్వదేశాలకు తిప్పిపంపితే అమెరికా వ్యాపార రంగానికి అపా ర నష్టం కలిగేదని కూడా ఆయన అన్నారు. హిందూ, అమెరికన్ ఫౌండేషన్ (హెచ్‌ఎఎస్) ఇడి సుహాగ్ శుక్లాకూడా అదే తీరుగా స్పందించారు. హెచ్1బి వీసాల పద్ధతి మార్పు లేకుండా యథావిధిగా కొనసాగుతుందన్న ప్రకటనను ప్రజాప్రతినిధుల సభ సభ్యులు కూడా ప్రశంసించారు. తుల్సీ గిబ్బార్డ్, కెవిన్ యోధర్ ఆ మేరకు ప్రకటనలు చేశారు.

Comments

comments